కోడెకాఁడు గదవమ్మ గోవిందరాజు
(॥పల్లవి॥)
కోడెకాఁడు గదవమ్మ గోవిందరాజు
వేడుక మోవులతేనె విందారగించీని
(॥కోడె॥)
కొలువు కూటములోన గోవిందరాజు వాఁడే
పలుమారుఁ జెలులతోఁ బందేలాడీని
నిలువుల మేడమీఁద నిలిచి గోవిందరాజు
వలపులు చల్లుచును వసంతాలాడీని
(॥కోడె॥)
కోరి కేళాకూళిలోన గోవిందరాజు వాఁడే
సారె నింతులతో నీరు చల్లులాడీని
తూరుచు సింగారపుఁ దోటలో గోవిందరాజు
సైరణ లేకందరితో జాజరలాడీని
(॥కోడె॥)
గోముల శ్రీ వేంకటాద్రి గోవిందరాజు వాఁడె
రామలతోడుతను సరసమాడీని
గామిడై పాన్పుపైఁ గూడి కందువగోవిందరాజు
మోములు చూచందరితో ముచ్చటలాడీని
(||pallavi||)
koḍĕgām̐ḍu gadavamma goviṁdarāju
veḍuga movuladenĕ viṁdāragiṁchīni
(||koḍĕ||)
kŏluvu kūḍamulona goviṁdarāju vām̐ḍe
palumārum̐ jĕluladom̐ baṁdelāḍīni
niluvula meḍamīm̐da nilisi goviṁdarāju
valabulu sallusunu vasaṁtālāḍīni
(||koḍĕ||)
kori keḽāgūḽilona goviṁdarāju vām̐ḍe
sārĕ niṁtulado nīru sallulāḍīni
tūrusu siṁgārabum̐ doḍalo goviṁdarāju
sairaṇa legaṁdarido jājaralāḍīni
(||koḍĕ||)
gomula śhrī veṁkaḍādri goviṁdarāju vām̐ḍĕ
rāmaladoḍudanu sarasamāḍīni
gāmiḍai pānpubaim̐ gūḍi kaṁduvagoviṁdarāju
momulu sūsaṁdarido muchchaḍalāḍīni