Kodaanamgotlaaya korigelu janmamulu

కోటానఁగోట్లాయ కోరికెలు జన్మములు
Language

(॥పల్లవి॥)
కోటానఁగోట్లాయ కోరికెలు జన్మములు
కూటువ గూడి రాట్నపుగుండ్ర లైనారయ్యా

(॥కోటా॥)
మిన్ను పైనున్న జీవులు మన్నుపైఁ బ్రవేశించి
అన్నద్వారమున దేహము మోఁచి
మున్నిటి దానఫలా లిమ్ముల భుజించి యప్పటి
తిన్నని కర్మములు గాదెలఁ బోసేరయ్యా

(॥కోటా॥)
యిరవు మఱచి మఱి యెరవులకాఁపిరేల
సురలు నరులమంటాఁ జొక్కిచొక్కి
సొరిది లోకములెల్లాఁ జొచ్చి కాలగతులను
పొరి నాయుష్యము గొల్చిపోయుచున్నారయ్యా

(॥కోటా॥)
దండగాఁగఁ దిరుమలకొండయెక్కి సుజ్ఞానులు
పండిన మనసుతోడ బత్తినేసి
అండనే శ్రీవేంకటేశు నలమేల్మంగనుఁ గొల్చి
నిండునిధానములై నిల్చినారయ్యా

(||pallavi||)
koḍānam̐goṭlāya korigĕlu janmamulu
kūḍuva gūḍi rāṭnabuguṁḍra lainārayyā

(||koḍā||)
minnu painunna jīvulu mannubaim̐ braveśhiṁchi
annadvāramuna dehamu mom̐si
munniḍi dānaphalā limmula bhujiṁchi yappaḍi
tinnani karmamulu gādĕlam̐ boserayyā

(||koḍā||)
yiravu maṟasi maṟi yĕravulagām̐pirela
suralu narulamaṁṭām̐ jŏkkisŏkki
sŏridi logamulĕllām̐ jŏchchi kālagadulanu
pŏri nāyuṣhyamu gŏlsiboyusunnārayyā

(||koḍā||)
daṁḍagām̐gam̐ dirumalagŏṁḍayĕkki sujñānulu
paṁḍina manasudoḍa battinesi
aṁḍane śhrīveṁkaḍeśhu nalamelmaṁganum̐ gŏlsi
niṁḍunidhānamulai nilsinārayyā