కొచ్చి నేఁ బైకొనేనంటే గోలదానను
(॥పల్లవి॥)
కొచ్చి నేఁ బైకొనేనంటే గోలదానను
యెచ్చిన నా వలుపే ఇంత సేసే నన్నును
(॥॥)
నీ మొగము చూచితేను నీ సుద్దులు దలఁపౌను
చే ముట్టితే పులకలు చిమ్మి రేఁగును
కామించి వద్ద నుండితే కళలు దైవారును
యేమి సేతు నా వలపు లింత సేసే నన్నును
(॥॥)
విన్నపము సేసేనంటే వెస నిండీ సిగ్గులు
పన్ని వేఁడఁబోతే ముంచీఁ బరవసము
సన్నలు సేసేనంటే జలజలఁ జెమరించీ
యెన్నరాని నా వలపు వింత సేసే నన్నును
(॥॥)
సరసము లాడేనంటే సంతోము లెల్లఁ దొట్టీ
అరుదుగా నవ్వేనంటే నాసలు వుట్టీ
యెరవు లేని శ్రీ వేంకటేశ యలమేల్మంగను
యిరవైతి నా వలపు లింత సేసే నన్నునూ
(||pallavi||)
kŏchchi nem̐ baigŏnenaṁṭe goladānanu
yĕchchina nā valube iṁta sese nannunu
(||||)
nī mŏgamu sūsidenu nī suddulu dalam̐paunu
se muṭṭide pulagalu simmi rem̐gunu
kāmiṁchi vadda nuṁḍide kaḽalu daivārunu
yemi sedu nā valabu liṁta sese nannunu
(||||)
vinnabamu sesenaṁṭe vĕsa niṁḍī siggulu
panni vem̐ḍam̐bode muṁchīm̐ baravasamu
sannalu sesenaṁṭe jalajalam̐ jĕmariṁchī
yĕnnarāni nā valabu viṁta sese nannunu
(||||)
sarasamu lāḍenaṁṭe saṁtomu lĕllam̐ dŏṭṭī
arudugā navvenaṁṭe nāsalu vuṭṭī
yĕravu leni śhrī veṁkaḍeśha yalamelmaṁganu
yiravaidi nā valabu liṁta sese nannunū