కొచ్చి కొచ్చి కొసరీనే గొల్లకొసరు
(॥పల్లవి॥)
కొచ్చి కొచ్చి కొసరీనే గొల్లకొసరు
కుచ్చి యెత్తవే చన్నుల గొల్లకొసరు
(॥కొచ్చి॥)
చేరువనుండి నిన్నుఁ జెనకీనదివో వాఁడు
గోరికొనలనొత్తవే గొల్లకొసరు
మారుకొని నీతోనిట్టె మాఁటలాడ వచ్చీని
కూరిమిఁ దిట్టఁగదవే గొల్లకొసరు
(॥కొచ్చి॥)
పఱచుఁజేఁతలు చేసి పైకొనీ వచ్చి వాఁడు
గుఱుతు మోవిసేయవే గొల్లకొసరు
మెఱసి పెనఁగవచ్చీ మిక్కుటపురతులను
కొఱకొఱఁ బెట్టఁగదే గొల్లకొసరు
(॥కొచ్చి॥)
చెల్లుబడి వావిచెప్పి శ్రీవెంకటేశుఁడు గూడె
కొల్లున నవ్వఁగదవే గొల్లకొసరు
బల్లిదుఁడాతఁడు నీవు పట్టపు దేవులవై
కొల్లలాడేవే వలపు గొల్ల కొసరు
(||pallavi||)
kŏchchi kŏchchi kŏsarīne gŏllagŏsaru
kuchchi yĕttave sannula gŏllagŏsaru
(||kŏchchi||)
seruvanuṁḍi ninnum̐ jĕnagīnadivo vām̐ḍu
gorigŏnalanŏttave gŏllagŏsaru
mārugŏni nīdoniṭṭĕ mām̐ṭalāḍa vachchīni
kūrimim̐ diṭṭam̐gadave gŏllagŏsaru
(||kŏchchi||)
paṟasum̐jem̐talu sesi paigŏnī vachchi vām̐ḍu
guṟudu moviseyave gŏllagŏsaru
mĕṟasi pĕnam̐gavachchī mikkuḍaburadulanu
kŏṟagŏṟam̐ bĕṭṭam̐gade gŏllagŏsaru
(||kŏchchi||)
sĕllubaḍi vāvisĕppi śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕ
kŏlluna navvam̐gadave gŏllagŏsaru
ballidum̐ḍādam̐ḍu nīvu paṭṭabu devulavai
kŏllalāḍeve valabu gŏlla kŏsaru