Kobamu gaadu tanado guttudeliyaga kaani

కోపము గాదు తనతో గుట్టుదెలియక కాని
Language

(॥పల్లవి॥)
కోపము గాదు తనతో గుట్టుదెలియక కాని
పోపో యెక్కడి సుద్ది బూటకమా తాను

(॥కోప॥)
మనసు దెలియఁగాక మాటలు నాకొకదొడ్డా
తనవంకనే మోనము తనరె నాకు
అనఁగానే యెదిరికి నలుకై తోఁచె నిది
పనిలేనిపని నాకుఁ బగవాఁడా తాను

(॥కోప॥)
సెలవు వినకేశాక చేఁతలు నాకొకదొడ్డా
చలము దనవంకనే జడిసీ నాకు
యిల నిది నిందరికి నెగసక్కెమైతోఁచీ
వలవని ఱట్టు గాక వాదువాఁడా తాను

(॥కోప॥)
కాఁక లుండఁగాఁగాక కాఁగిలి నాకొకదొడ్డా
వీఁకలు దనవంకనే వెలసీ నాకు
యేఁకట వాయ శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
మాఁకువలె మైమఱచె మాయకాఁడా తాను

(||pallavi||)
kobamu gādu tanado guṭṭudĕliyaga kāni
pobo yĕkkaḍi suddi būḍagamā tānu

(||koba||)
manasu dĕliyam̐gāga māḍalu nāgŏgadŏḍḍā
tanavaṁkane monamu tanarĕ nāgu
anam̐gāne yĕdirigi nalugai tom̐sĕ nidi
panilenibani nāgum̐ bagavām̐ḍā tānu

(||koba||)
sĕlavu vinageśhāga sem̐talu nāgŏgadŏḍḍā
salamu danavaṁkane jaḍisī nāgu
yila nidi niṁdarigi nĕgasakkĕmaidom̐sī
valavani ṟaṭṭu gāga vāduvām̐ḍā tānu

(||koba||)
kām̐ka luṁḍam̐gām̐gāga kām̐gili nāgŏgadŏḍḍā
vīm̐kalu danavaṁkane vĕlasī nāgu
yem̐kaḍa vāya śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
mām̐kuvalĕ maimaṟasĕ māyagām̐ḍā tānu