Kobamu deerinameemdam goodevu gaaga

కోపము దీరినమీఁదఁ గూడేవు గాక
Language

(॥పల్లవి॥)
కోపము దీరినమీఁదఁ గూడేవు గాక
కైపుగ నీ వొళ్లిదె కల్ల యనవయ్యా

(॥కోపము॥)
యే మంటివో కాని యింతి గడుఁ జిన్నఁ బోయ
వేమారు నలుక దీర వేఁడుకోవయ్య
ప్రేమతో బలిమి నేసి పెనఁగి యేమి నేసితో
వాములుగఁ దిట్టకోనీ వద్దనవయ్యా

(॥కోపము॥)
యింతిచిత్తము నొవ్వఁగ యెవ్వరిదిక్కు చూచితో
అంతలో దల వంచె లే దనవయ్యా
అంతటఁ బోక నీవు అట్టె యేమి నవ్వితివో
చింతతో లోనికిఁ బోయీ చేరి పట్టవయ్యా

(॥కోపము॥)
మితియేమి మీరితివో మెలుఁత నిట్టూర్పు నించె
చతురతఁ గరిములు చల్లవయ్యా
తతితో శ్రీవెంకటేశ దగ్గరి కూడితి వాకె
రతి నలనెను మోవిరస మియ్యవయ్యా

(||pallavi||)
kobamu dīrinamīm̐dam̐ gūḍevu gāga
kaibuga nī vŏḽlidĕ kalla yanavayyā

(||kobamu||)
ye maṁṭivo kāni yiṁti gaḍum̐ jinnam̐ boya
vemāru naluga dīra vem̐ḍugovayya
premado balimi nesi pĕnam̐gi yemi nesido
vāmulugam̐ diṭṭagonī vaddanavayyā

(||kobamu||)
yiṁtisittamu nŏvvam̐ga yĕvvaridikku sūsido
aṁtalo dala vaṁchĕ le danavayyā
aṁtaḍam̐ boga nīvu aṭṭĕ yemi navvidivo
siṁtado lonigim̐ boyī seri paṭṭavayyā

(||kobamu||)
midiyemi mīridivo mĕlum̐ta niṭṭūrbu niṁchĕ
saduradam̐ garimulu sallavayyā
tadido śhrīvĕṁkaḍeśha daggari kūḍidi vāgĕ
radi nalanĕnu movirasa miyyavayyā