కోపగించుకొనకు మీకొమ్మ బత్తిసేసె నింతే
(॥పల్లవి॥)
కోపగించుకొనకు మీకొమ్మ బత్తిసేసె నింతే
వోపికగల దొరకు వోర్వఁగ వలెను
(॥కోప॥)
తరుణి నీమేన గందము వూసేపరాకున
నిరతి గట్టిచన్నులు నిన్నుఁ దాఁకెను
సరస నీకుఁ గొప్పు చక్కఁబెట్టేపరాకున
అరుదుగా నీచెక్కున నటు గోరంటెను
(॥కోప॥)
యింతి నీకు వీడెము లిచ్చేపరాకున-
నంతలోఁ జెమట నీపై నటు చిందెను
చెంతనుండి వూడిగాలు సేసేపరాకున
బంతినే నిట్టూర్పులు నీపై విసరఁ జొచ్చెను
(॥కోప॥)
అలమేలు మంగ నిన్ను నలమేపరాకున
నెలవై యాపెపాదము నిన్ను సోఁకెను
నలి శ్రీవేంకటేశ్వర నవ్వేపరాకున
కలికి తమ్ములము నీకాయమెల్లా నిండెను
(||pallavi||)
kobagiṁchugŏnagu mīgŏmma battisesĕ niṁte
vobigagala dŏragu vorvam̐ga valĕnu
(||koba||)
taruṇi nīmena gaṁdamu vūsebarāguna
niradi gaṭṭisannulu ninnum̐ dām̐kĕnu
sarasa nīgum̐ gŏppu sakkam̐bĕṭṭebarāguna
arudugā nīsĕkkuna naḍu goraṁṭĕnu
(||koba||)
yiṁti nīgu vīḍĕmu lichchebarāguna-
naṁtalom̐ jĕmaḍa nībai naḍu siṁdĕnu
sĕṁtanuṁḍi vūḍigālu sesebarāguna
baṁtine niṭṭūrbulu nībai visaram̐ jŏchchĕnu
(||koba||)
alamelu maṁga ninnu nalamebarāguna
nĕlavai yābĕbādamu ninnu som̐kĕnu
nali śhrīveṁkaḍeśhvara navvebarāguna
kaligi tammulamu nīgāyamĕllā niṁḍĕnu