Kobagimchugonadoo kosari ninnu dooradu

కోపగించుకొనదూ కొసరి నిన్ను దూరదు
Language

(॥పల్లవి॥)
కోపగించుకొనదూ కొసరి నిన్ను దూరదు
వోపికతోఁ దన కెంత వోరుపో కాని

(॥కోప॥)
చెక్కటి చేతితోడ సిగ్గుపడీ జవరాలు
పక్కనఁ జన్నులు నిమ్మపంట వేయఁగా
తక్కన నీమోము చూచి తలవంచుకొనీఁ దాను
మక్కువతోఁ గొనగోర మర్మము లంటఁగను

(॥కోప॥)
మలఁగుమాటున నుండి మచ్చిక నవ్వీఁ జెలి
చలివాపి నీవు సరసములాడఁగా
వెలయ నీమాట విని వెరగునొందీఁ దాను
తలకొన్న రతులెల్లాఁ దలపిఁగాను

(॥కోప॥)
ముచ్చటతో నిన్నుఁ గూడి మొక్కీ నలమేలుమంగ
పెచ్చురేఁగి కాఁగిటిలోఁ బెనఁగఁగాను
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్ను మెచ్చీఁదాను
నిచ్చలాన మోవితేనె నీవియ్యఁగాను

(||pallavi||)
kobagiṁchugŏnadū kŏsari ninnu dūradu
vobigadom̐ dana kĕṁta vorubo kāni

(||koba||)
sĕkkaḍi sedidoḍa siggubaḍī javarālu
pakkanam̐ jannulu nimmabaṁṭa veyam̐gā
takkana nīmomu sūsi talavaṁchugŏnīm̐ dānu
makkuvadom̐ gŏnagora marmamu laṁṭam̐ganu

(||koba||)
malam̐gumāḍuna nuṁḍi machchiga navvīm̐ jĕli
salivābi nīvu sarasamulāḍam̐gā
vĕlaya nīmāḍa vini vĕragunŏṁdīm̐ dānu
talagŏnna radulĕllām̐ dalabim̐gānu

(||koba||)
muchchaḍado ninnum̐ gūḍi mŏkkī nalamelumaṁga
pĕchchurem̐gi kām̐giḍilom̐ bĕnam̐gam̐gānu
ichchagiṁchi śhrīveṁkaḍeśha ninnu mĕchchīm̐dānu
nichchalāna movidenĕ nīviyyam̐gānu