కోపగించుకొన నోప గొరబూ నోప
(॥పల్లవి॥)
కోపగించుకొన నోప గొరబూ నోప
తీపుల మీఁదటి యెత్తు తెలిసేఁ గాని
(॥॥)
చెలుల దూరగనోప చిల్లరవాదుల కోప
చలపట్టి పతితోడ జంకించనోప
అలిగి పానుపుమీఁద నవ్వలిమోమై యుండఁగఁ
గలిగినపాటే మేలు కనుకొనేఁగాని
(॥॥)
దైవము దూరఁగ నోప తమకించి పడనోప
మోవనాడేవెంగెములు మొదల నోప
చేవదేరేచింతతోడ చెక్కుచేత నుండఁగాను
కావలసినపనులు కనుకొనేఁగాని
(॥॥)
పంతము లియ్యఁగ నోప బచ్చెనమాటల కోప
వంతువాసులకు నోప వరుస లోప
ఇంతటి శ్రీ వేంకటేశుఁడిట్టు నన్నుఁగూడె నేఁడు
కాంతుఁడితనితలఁపు కనుకొనేఁగాని
(||pallavi||)
kobagiṁchugŏna noba gŏrabū noba
tībula mīm̐daḍi yĕttu tĕlisem̐ gāni
(||||)
sĕlula dūraganoba sillaravādula koba
salabaṭṭi padidoḍa jaṁkiṁchanoba
aligi pānubumīm̐da navvalimomai yuṁḍam̐gam̐
galiginabāḍe melu kanugŏnem̐gāni
(||||)
daivamu dūram̐ga noba tamagiṁchi paḍanoba
movanāḍevĕṁgĕmulu mŏdala noba
sevaderesiṁtadoḍa sĕkkuseda nuṁḍam̐gānu
kāvalasinabanulu kanugŏnem̐gāni
(||||)
paṁtamu liyyam̐ga noba bachchĕnamāḍala koba
vaṁtuvāsulagu noba varusa loba
iṁtaḍi śhrī veṁkaḍeśhum̐ḍiṭṭu nannum̐gūḍĕ nem̐ḍu
kāṁtum̐ḍidanidalam̐pu kanugŏnem̐gāni