(॥పల్లవి॥)
కిందుపడి మొక్కకుమీ కేశవా
కెందమ్మిరేకుఁగన్నుల కేశవా
(॥కిందు॥)
కేలు చాఁచే వింతలోనే కేశవా రతి
కేలికి మాయాడకే రా కేశవా
గేలి సేసేవేల మమ్ము కేశవా నీ
కేలు నా చేత నున్నది కేశవా
(॥కిందు॥)
గెరసు దాఁటకు వోయి కేశవా మంకుఁ
గెరలించేవు వలపు కేశవా
గిరికుచము లివిగో కేశవా నీకు
గిరపు వెట్టు కున్నదాన కేశవా
(॥కిందు॥)
కిలకిల నవ్వనేల కేశవా నీకు
కెలనివారమా నేము కేశవా
గిలిగించి కూడితివి కేశవా నాతోఁ
గెలసేవు శ్రీవేంకటకేశవా
(||pallavi||)
kiṁdubaḍi mŏkkagumī keśhavā
kĕṁdammiregum̐gannula keśhavā
(||kiṁdu||)
kelu sām̐se viṁtalone keśhavā radi
keligi māyāḍage rā keśhavā
geli sesevela mammu keśhavā nī
kelu nā seda nunnadi keśhavā
(||kiṁdu||)
gĕrasu dām̐ṭagu voyi keśhavā maṁkum̐
gĕraliṁchevu valabu keśhavā
girigusamu livigo keśhavā nīgu
girabu vĕṭṭu kunnadāna keśhavā
(||kiṁdu||)
kilagila navvanela keśhavā nīgu
kĕlanivāramā nemu keśhavā
giligiṁchi kūḍidivi keśhavā nādom̐
gĕlasevu śhrīveṁkaḍageśhavā