(॥పల్లవి॥)
కేరడమాడఁగలనా కేశవరాయా
చూరగొని మర్మములు సోఁకింతుఁగాక
(॥కేర॥)
పంతమాడితే నీతోఁ బతి యాడఁగలనా
కాంతలతోఁ జెప్పి నవ్వఁగలగాక
దొంతి సాకిరివెట్టేవు తొలమనఁగలఁగాక
కొంత మోముమూసుక సిగ్గున నుందుఁగాక
(॥కేర॥)
వట్టియెమ్మె మెరసితే వద్దన నేఁ గలనా
చుట్టపుమొకమోటానఁ జూతుఁగాక
వెట్టినీచేఁతలకు వేఁగై మాడఁగలనా
కిట్టి మరునికి నొప్పగించఁగలఁగాక
(॥కేర॥)
కాఁగిలించితే నిన్నుఁ గాదనఁగఁగలనా
లోఁగి యందులకే చొక్కి లోనౌదుఁగాక
నాఁగులెల్లఁ దీర మాఁచనవోలిచెన్నుఁడవై
మూఁగితి శ్రీవేంకటేశ మోవి యిచ్చేఁగాక
(||pallavi||)
keraḍamāḍam̐galanā keśhavarāyā
sūragŏni marmamulu som̐kiṁtum̐gāga
(||kera||)
paṁtamāḍide nīdom̐ badi yāḍam̐galanā
kāṁtaladom̐ jĕppi navvam̐galagāga
dŏṁti sāgirivĕṭṭevu tŏlamanam̐galam̐gāga
kŏṁta momumūsuga sigguna nuṁdum̐gāga
(||kera||)
vaṭṭiyĕmmĕ mĕraside vaddana nem̐ galanā
suṭṭabumŏgamoḍānam̐ jūdum̐gāga
vĕṭṭinīsem̐talagu vem̐gai māḍam̐galanā
kiṭṭi marunigi nŏppagiṁcham̐galam̐gāga
(||kera||)
kām̐giliṁchide ninnum̐ gādanam̐gam̐galanā
lom̐gi yaṁdulage sŏkki lonaudum̐gāga
nām̐gulĕllam̐ dīra mām̐sanavolisĕnnum̐ḍavai
mūm̐gidi śhrīveṁkaḍeśha movi yichchem̐gāga