Kattaro kaluvadaalu gakkana vaagillanu

కట్టరో కలువడాలు గక్కన వాకిళ్లను
Language

(॥పల్లవి॥)
కట్టరో కలువడాలు గక్కన వాకిళ్లను
పట్టరో వులుపలు శోభనద్రవ్యములును

(॥కట్ట॥)
తిరుకొడి యొక్కెనదె దేవునికల్యాణానకు
గరుడపటము పెఁ(పైఁ?) డి కంబమందును
ధరపై బ్రహ్మాదిదేవతలెల్లాను వచ్చిరదె
వరుసతో వాయిద్యాలు వాయించరో

(॥కట్ట॥)
ముంచి హోమములు సేసి మునులు సంభ్రమమున
అంచెల గడియ కుడు కట్టె పెట్టిరి
పెంచముగఁ దెరవేసి పెండ్లిపీఁట వెట్టిరదె
మించఁ బేరంటాండ్లు నర్మిలిఁ బాడరో

(॥కట్ట॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యలమేల్మంగయు
యీవేళఁ దలఁబాలు ఇట్టె పోసిరి
బూవములు పొత్తునను భుజియించి రిప్పు డిట్టె
వేవేలకుఁ గప్పురపువిడే లియ్యరో

(||pallavi||)
kaṭṭaro kaluvaḍālu gakkana vāgiḽlanu
paṭṭaro vulubalu śhobhanadravyamulunu

(||kaṭṭa||)
tirugŏḍi yŏkkĕnadĕ devunigalyāṇānagu
garuḍabaḍamu pĕm̐(paim̐?) ḍi kaṁbamaṁdunu
dharabai brahmādidevadalĕllānu vachchiradĕ
varusado vāyidyālu vāyiṁcharo

(||kaṭṭa||)
muṁchi homamulu sesi munulu saṁbhramamuna
aṁchĕla gaḍiya kuḍu kaṭṭĕ pĕṭṭiri
pĕṁchamugam̐ dĕravesi pĕṁḍlibīm̐ṭa vĕṭṭiradĕ
miṁcham̐ beraṁṭāṁḍlu narmilim̐ bāḍaro

(||kaṭṭa||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri yalamelmaṁgayu
yīveḽam̐ dalam̐bālu iṭṭĕ posiri
būvamulu pŏttunanu bhujiyiṁchi rippu ḍiṭṭĕ
vevelagum̐ gappurabuviḍe liyyaro