Kattamgada nooragumdi kattugone demunnadi

కట్టఁగడ నూరకుండి కట్టుకొనే దేమున్నది
Language

(॥పల్లవి॥)
కట్టఁగడ నూరకుండి కట్టుకొనే దేమున్నది
చుట్టాల సురభివై చొక్కించరాదా

(॥కట్ట॥)
సారెసారె నిన్నుఁ జూచి సతి మరఁగున నుండీ
చేరఁడేసికన్నుల చెలియ
యీరీతి యాఁకరీఁ దాను యీకెయాస యెంతో
కోరినకోరికలెల్లాఁ గొనసాగించరాదా

(॥కట్ట॥)
యెట్టనెదుటనే వుండీ యిదివో కొలువు సేసీ
పట్టెఁడేసిగుబ్బలపడఁతి
నెట్టుకొన్న వలపుతో బట్టబయలీఁదీఁ దాను
యిట్టె యీపెనేస్తము లీడెరించరాదా

(॥కట్ట॥)
చేఁగదేర నింతలొనె చెలి నీవద్దఁ గూచుండె
కాఁగెఁడేసిపిరుఁదులకలికి
వీఁగక శ్రీవేంకటేశ వెలఁది నిన్నుఁ బెండ్లాడె
మాఁగినమోవి యొసఁగి మన్నించరాదా

(||pallavi||)
kaṭṭam̐gaḍa nūraguṁḍi kaṭṭugŏne demunnadi
suṭṭāla surabhivai sŏkkiṁcharādā

(||kaṭṭa||)
sārĕsārĕ ninnum̐ jūsi sadi maram̐guna nuṁḍī
seram̐ḍesigannula sĕliya
yīrīdi yām̐karīm̐ dānu yīgĕyāsa yĕṁto
korinagorigalĕllām̐ gŏnasāgiṁcharādā

(||kaṭṭa||)
yĕṭṭanĕduḍane vuṁḍī yidivo kŏluvu sesī
paṭṭĕm̐ḍesigubbalabaḍam̐ti
nĕṭṭugŏnna valabudo baṭṭabayalīm̐dīm̐ dānu
yiṭṭĕ yībĕnestamu līḍĕriṁcharādā

(||kaṭṭa||)
sem̐gadera niṁtalŏnĕ sĕli nīvaddam̐ gūsuṁḍĕ
kām̐gĕm̐ḍesibirum̐dulagaligi
vīm̐gaga śhrīveṁkaḍeśha vĕlam̐di ninnum̐ bĕṁḍlāḍĕ
mām̐ginamovi yŏsam̐gi manniṁcharādā