Karunimtuvu gaani kaamtanu nenu

కరుణింతువు గాని కాంతను నేను
Language

(॥పల్లవి॥)
కరుణింతువు గాని కాంతను నేను
అరమరపుల నిఁక నలయకుమీ

(॥॥)
జిగురువంటిది నాచిత్తములోనివలపు
తగరువంటిది నీపై దాకొన్న యాస
తగిలి తగిలి నిన్నుఁ దరవులువెట్టఁగాను
వెగటులు సేసుకొని వేసరకుమీ

(॥॥)
సూదిరాయివలె నంటు సొరిది నాతోపొందు
దూదివలె మెత్తన కందువకాఁగిలి
ఆదిగొని నేను నీయాయములు ముట్టఁగాను
ఆదరింతువు గాని మారాడకుమీ

(॥॥)
చిగురునఁ బోలు నాచేచేతివూడిగము
పగటునిందులఁ బోలు బహురతులు
అగపడి కూడితి నిన్నల మేలుమంగ నే నీకుఁ
జిగి శ్రీ వేంకటేశుఁడ చెదరకుమీ

(||pallavi||)
karuṇiṁtuvu gāni kāṁtanu nenu
aramarabula nim̐ka nalayagumī

(||||)
jiguruvaṁṭidi nāsittamulonivalabu
tagaruvaṁṭidi nībai dāgŏnna yāsa
tagili tagili ninnum̐ daravuluvĕṭṭam̐gānu
vĕgaḍulu sesugŏni vesaragumī

(||||)
sūdirāyivalĕ naṁṭu sŏridi nādobŏṁdu
dūdivalĕ mĕttana kaṁduvagām̐gili
ādigŏni nenu nīyāyamulu muṭṭam̐gānu
ādariṁtuvu gāni mārāḍagumī

(||||)
sigurunam̐ bolu nāsesedivūḍigamu
pagaḍuniṁdulam̐ bolu bahuradulu
agabaḍi kūḍidi ninnala melumaṁga ne nīgum̐
jigi śhrī veṁkaḍeśhum̐ḍa sĕdaragumī