(॥పల్లవి॥)
కరుణించుము నీ కామినిని
యిరవుగ కడుఁ జనవియ్యవయ్యా
(॥॥)
పెలుచుఁదనపు నీబీరంబులకే
చలములు నెరపితి సారెకును
నెలవుగ నేనన్నిటికి సెలవుగా
మొలకవలపులను మొక్కేమయ్యా
(॥॥)
బంతి నీవాడేటిపంతంబులకే
వంతునఁ బెనఁగితి వాసికిని
మంతనమున నీమన సొక్కటిగా
చెంతలఁ బ్రియములు చెప్పేమయ్యా
(॥॥)
వెగ్గలమగు నీవేసంబులకే
సిగ్గున నవ్వితి సెలవులను
అగ్గపుశ్రీవేంకటాధిప కూడితి-
వొగ్గుచుఁ జన్నుల నొరసేమయ్యా
(||pallavi||)
karuṇiṁchumu nī kāminini
yiravuga kaḍum̐ janaviyyavayyā
(||||)
pĕlusum̐danabu nībīraṁbulage
salamulu nĕrabidi sārĕgunu
nĕlavuga nenanniḍigi sĕlavugā
mŏlagavalabulanu mŏkkemayyā
(||||)
baṁti nīvāḍeḍibaṁtaṁbulage
vaṁtunam̐ bĕnam̐gidi vāsigini
maṁtanamuna nīmana sŏkkaḍigā
sĕṁtalam̐ briyamulu sĕppemayyā
(||||)
vĕggalamagu nīvesaṁbulage
sigguna navvidi sĕlavulanu
aggabuśhrīveṁkaḍādhiba kūḍidi-
vŏggusum̐ jannula nŏrasemayyā