Karunimchu mimkanaina kaampuramaa

కరుణించు మిఁకనైన కాఁపురమా
Language

(॥పల్లవి॥)
కరుణించు మిఁకనైన కాఁపురమా
కరికరిఁ బెట్టకుమీ కాఁపురమా

(॥కరు॥)
కలలోని సుఖమైన కాఁపురమా
కలుషమే చవియైన కాఁపురమా
కలను బేహారపు కాఁపురమా
కలఁడు మా కిదే హరి కాఁపురమా

(॥కరు॥)
గంట వేఁటలో తగులు కాఁపురమా
కంట వత్తివెట్టి కాచే కాఁపురమా
గంటుగిందుగాఁ బొరలే కాఁపురమా
కంటిమి శ్రీపతికృప కాఁపురమా

(॥కరు॥)
కావిరి వెఱ్ఱి చేరాయి కాఁపురమా
కావలసినట్లయ్యే కాఁపురమా
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్ను నన్ను నొక్క-
కైవశము సేసెఁగదో కాఁపురమా

(||pallavi||)
karuṇiṁchu mim̐kanaina kām̐puramā
karigarim̐ bĕṭṭagumī kām̐puramā

(||karu||)
kalaloni sukhamaina kām̐puramā
kaluṣhame saviyaina kām̐puramā
kalanu behārabu kām̐puramā
kalam̐ḍu mā kide hari kām̐puramā

(||karu||)
gaṁṭa vem̐ṭalo tagulu kām̐puramā
kaṁṭa vattivĕṭṭi kāse kām̐puramā
gaṁṭugiṁdugām̐ bŏrale kām̐puramā
kaṁṭimi śhrībadikṛpa kām̐puramā

(||karu||)
kāviri vĕṭri serāyi kām̐puramā
kāvalasinaṭlayye kām̐puramā
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri ninnu nannu nŏkka-
kaivaśhamu sesĕm̐gado kām̐puramā