కరుణించి నీవు గాఁగాఁ గాచితివి గాక
(॥పల్లవి॥)
కరుణించి నీవు గాఁగాఁ గాచితివి గాక
శరణని విన్నవించ సంగతులా నాకు
(॥కరు॥)
దిట్టనై నేఁ జేసిన దిమ్మరిచేఁతలకును
జట్టిగా నీ నరకాలు చాలునా నాకు
పుట్టిన నా జన్మములు పొసగఁగ వ్రాయఁబోతే
అట్టె వనముల తాటియాకు లెల్లాఁ జాలునా
(॥కరు॥)
కదిసి నే నాడేటి కల్ల లెంచి చూచితేను
మొదల యీ భూమియైనా మోచునా నన్ను
ఆదన నే నాచరించే అనాచారపు టెంగిలి
నదులజలాలు పావనము సేయఁగలవా
(॥కరు॥)
తొలుత నేఁ దలఁచిన ద్రోహాలకు మాఁకు లెల్లా
యిలఁ గొఱ్ఱులు సేసినా యిందుఁ బాయునా
అలరి మరి దిక్కు లేరని శ్రీవేంకటేశ్వర
తెలిసి నీవే నాకు దిక్కై కాచితివి
(||pallavi||)
karuṇiṁchi nīvu gām̐gām̐ gāsidivi gāga
śharaṇani vinnaviṁcha saṁgadulā nāgu
(||karu||)
diṭṭanai nem̐ jesina dimmarisem̐talagunu
jaṭṭigā nī naragālu sālunā nāgu
puṭṭina nā janmamulu pŏsagam̐ga vrāyam̐bode
aṭṭĕ vanamula tāḍiyāgu lĕllām̐ jālunā
(||karu||)
kadisi ne nāḍeḍi kalla lĕṁchi sūsidenu
mŏdala yī bhūmiyainā mosunā nannu
ādana ne nāsariṁche anāsārabu ṭĕṁgili
nadulajalālu pāvanamu seyam̐galavā
(||karu||)
tŏluda nem̐ dalam̐sina drohālagu mām̐ku lĕllā
yilam̐ gŏṭrulu sesinā yiṁdum̐ bāyunā
alari mari dikku lerani śhrīveṁkaḍeśhvara
tĕlisi nīve nāgu dikkai kāsidivi