(॥పల్లవి॥)
కరుణించవయ్యా యీ కడమ లేల
వర మిచ్చితివి తొల్లే వలెనా యీ బాసలు
(॥కరు॥)
యేమి గట్టుకొంటి వింతేసిచేఁతలు సేసి
కామిని నేఁచఁగా నెంతకండ వచ్చెను
తేమ రేఁగే జూపులు తెల్లవారె మాపులు
వాము లాయ నీపై నింకా వలెనా రారాఁపులు
(॥కరు॥)
పొద్దు వొద్దు నిందువంక పుణ్య మెంత చేరె నీకు
వద్దికి రాక యెంత వన్నె కెక్కేవు
తిద్దరాదు వలపులు తీగెసాగె మెలుపులు
పెద్దరికముతో నింతప్రియమా పిలుపులు
(॥కరు॥)
యేతులకు నవ్వు నవ్వి యెంతజాణఁడ వైతివి
యీతలివా రెల్ల నిన్ను నెంత మెచ్చిరి
చేతికి లోనై కూడితి శ్రీ వేంకటేశ మా చెలిని
బూతులు ఘాతలు నీకె పొఁగె నీనీతులు
(||pallavi||)
karuṇiṁchavayyā yī kaḍama lela
vara michchidivi tŏlle valĕnā yī bāsalu
(||karu||)
yemi gaṭṭugŏṁṭi viṁtesisem̐talu sesi
kāmini nem̐sam̐gā nĕṁtagaṁḍa vachchĕnu
tema rem̐ge jūbulu tĕllavārĕ mābulu
vāmu lāya nībai niṁkā valĕnā rārām̐pulu
(||karu||)
pŏddu vŏddu niṁduvaṁka puṇya mĕṁta serĕ nīgu
vaddigi rāga yĕṁta vannĕ kĕkkevu
tiddarādu valabulu tīgĕsāgĕ mĕlubulu
pĕddarigamudo niṁtapriyamā pilubulu
(||karu||)
yedulagu navvu navvi yĕṁtajāṇam̐ḍa vaidivi
yīdalivā rĕlla ninnu nĕṁta mĕchchiri
sedigi lonai kūḍidi śhrī veṁkaḍeśha mā sĕlini
būdulu ghādalu nīgĕ pŏm̐gĕ nīnīdulu