Karunimchavayyaa kaaminini

కరుణించవయ్యా కామినిని
Language

(॥పల్లవి॥)
కరుణించవయ్యా కామినిని
గరిమ నివ్వెరగుల కాణాచితో నున్నది

(॥కరు॥)
జమళికానుకలు సతి నీకు వియ్యవచ్చి
సముకాన నిలిచుండీ చాఁచుమా చెయ్యి
నెమకి చెక్కులనే నిలువుటద్దాలు వట్టి
అమర నూడిగాలు నీకదివో సేసీని

(॥కరు॥)
వేడుక మోవిపంటి విందు నీకుఁ జెప్పవచ్చి
వోడుక నిన్నుఁ జూచీ వొగ్గుమా కొంగు
వీడినకొప్పునీలాలు వెలసేసి నీకుఁ జూపి
జాడతోడ నిచ్చకాలు సారెసారె జేసి నీకును

(॥కరు॥)
కనకపుమేనివన్నె కప్పములు నీకుఁ బట్టి
చెనకీఁ బానుపుమీఁద జేకొనరాదా
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసె నిన్నింతలోనే
వనిత నానారతుల వంతులువేసీవి

(||pallavi||)
karuṇiṁchavayyā kāminini
garima nivvĕragula kāṇāsido nunnadi

(||karu||)
jamaḽigānugalu sadi nīgu viyyavachchi
samugāna nilisuṁḍī sām̐sumā sĕyyi
nĕmagi sĕkkulane niluvuḍaddālu vaṭṭi
amara nūḍigālu nīgadivo sesīni

(||karu||)
veḍuga movibaṁṭi viṁdu nīgum̐ jĕppavachchi
voḍuga ninnum̐ jūsī vŏggumā kŏṁgu
vīḍinagŏppunīlālu vĕlasesi nīgum̐ jūbi
jāḍadoḍa nichchagālu sārĕsārĕ jesi nīgunu

(||karu||)
kanagabumenivannĕ kappamulu nīgum̐ baṭṭi
sĕnagīm̐ bānubumīm̐da jegŏnarādā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasĕ ninniṁtalone
vanida nānāradula vaṁtuluvesīvi