Karunimchavayya yimka kadu jaanavauduvu

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు
Language

(॥పల్లవి॥)
కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు
వొరసే రింతులు పొదటూరి చెన్నరాయా

(॥కరు॥)
దగ్గరి కొలనిదరి తరుణులెల్లాఁగూడి
సిగ్గులఁ జాఁచేరదివో చేతులు నీపై
వెగ్గళించి కన్నుల వెడనవ్వులు నవ్వుతా
వొగ్గేరు వలపు పొదటూరిచెన్నరాయా

(॥కరు॥)
తొల్లి నోఁచిననోములు తోడనిట్టే పలియించె
వల్లెగా నీపొందులకు వచ్చివున్నారు
చల్లలమ్మేమాటలనే సరసములాడేరు
వుల్లములలర పొదటూరిచెన్నరాయా

(॥కరు॥)
చీరలు నీవియ్యఁగాను చేకొని కాఁగలించిరి
మేరతో శ్రీ వెంకటాద్రిమీఁదనే నిన్ను
గారవించి యిందునందు కందువలు మెరసిరి
వూరటగా నీకుఁ బొదటూరిచెన్నరాయా

(||pallavi||)
karuṇiṁchavayya yim̐ka kaḍu jāṇavauduvu
vŏrase riṁtulu pŏdaḍūri sĕnnarāyā

(||karu||)
daggari kŏlanidari taruṇulĕllām̐gūḍi
siggulam̐ jām̐seradivo sedulu nībai
vĕggaḽiṁchi kannula vĕḍanavvulu navvudā
vŏggeru valabu pŏdaḍūrisĕnnarāyā

(||karu||)
tŏlli nom̐sinanomulu toḍaniṭṭe paliyiṁchĕ
vallĕgā nībŏṁdulagu vachchivunnāru
sallalammemāḍalane sarasamulāḍeru
vullamulalara pŏdaḍūrisĕnnarāyā

(||karu||)
sīralu nīviyyam̐gānu segŏni kām̐galiṁchiri
merado śhrī vĕṁkaḍādrimīm̐dane ninnu
gāraviṁchi yiṁdunaṁdu kaṁduvalu mĕrasiri
vūraḍagā nīgum̐ bŏdaḍūrisĕnnarāyā