కరుణగలవాఁడవు ఘనుడ విన్నిటా నీవు
(॥పల్లవి॥)
కరుణగలవాఁడవు ఘనుడ విన్నిటా నీవు
తరుణిని నాతో నిట్టె తగులై వుండుమీ
(॥కరు॥)
చెక్కులు నొక్కితి నిన్ను సేదలు దేరిచితిని
మక్కువతో నన్నిట్టె మన్నించుమీ
మొక్కులు మొక్కి నీపై మోహము నేఁజల్లితి
తక్కుక నాపై నిఁక దయవెట్టుమీ
(॥కరు॥)
కన్నుల నే జూచితిని కందువలు నంటితిని
వెన్నెలనవ్వులు నాపై వెదచల్లుమీ
చన్నుల నొత్తితి నీతో సరసములూ నాడితి
యిన్నిటా మంచితన మిటు నాకుఁ జూపుమీ
(॥కరు॥)
సేవలు నేసితి నీకు జెప్పితి బ్రియములెల్లా
కైవశమై నీవు నాకు గలిగుండుమీ
వావులు చెప్పితి నీవు వరమిచ్చి కూడితివి
శ్రీవేంకటేశ్వర నన్ను జిత్తగించుమీ
(||pallavi||)
karuṇagalavām̐ḍavu ghanuḍa vinniḍā nīvu
taruṇini nādo niṭṭĕ tagulai vuṁḍumī
(||karu||)
sĕkkulu nŏkkidi ninnu sedalu derisidini
makkuvado nanniṭṭĕ manniṁchumī
mŏkkulu mŏkki nībai mohamu nem̐jallidi
takkuga nābai nim̐ka dayavĕṭṭumī
(||karu||)
kannula ne jūsidini kaṁduvalu naṁṭidini
vĕnnĕlanavvulu nābai vĕdasallumī
sannula nŏttidi nīdo sarasamulū nāḍidi
yinniḍā maṁchidana miḍu nāgum̐ jūbumī
(||karu||)
sevalu nesidi nīgu jĕppidi briyamulĕllā
kaivaśhamai nīvu nāgu galiguṁḍumī
vāvulu sĕppidi nīvu varamichchi kūḍidivi
śhrīveṁkaḍeśhvara nannu jittagiṁchumī