కరుణానిధివిగాఁగ కాచేవు గాక
(॥పల్లవి॥)
కరుణానిధివిగాఁగ కాచేవు గాక
యిరవై నావంటివాని కిది యసంగతము
(॥కరుణా॥)
నేర నే పుణ్యము సేయ నిత్యానిత్య మెఱిఁగి
నేరుతు రిత్తచేతుల నీకు మొక్కేది
యేరీతిఁ బరమిచ్చేవొ యేమి గలదు నాయందు
కారణములేని యీవి కడు ననంగతము
(॥కరుణా॥)
లేదు విజ్ఞానము గొంత లేశమైన నాయందు
సాదించఁ గద్దొకటి మీ శరణనేది
ఆదిగొని నన్నుఁ బాయ వంతరాత్మవై నీవు
వీదరవెల్లి పొందులు విన ననంగతము
(॥కరుణా॥)
కాను నే నరుహుఁడను కదిసి పనులకు
నే నవుదు నొకటికి నిన్నుఁ బాడను
యీ నెపాన శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
దానికిఁ దగ్గంతె కాక దాఁట ననంగతము
(||pallavi||)
karuṇānidhivigām̐ga kāsevu gāga
yiravai nāvaṁṭivāni kidi yasaṁgadamu
(||karuṇā||)
nera ne puṇyamu seya nityānitya mĕṟim̐gi
nerudu rittasedula nīgu mŏkkedi
yerīdim̐ baramichchevŏ yemi galadu nāyaṁdu
kāraṇamuleni yīvi kaḍu nanaṁgadamu
(||karuṇā||)
ledu vijñānamu gŏṁta leśhamaina nāyaṁdu
sādiṁcham̐ gaddŏgaḍi mī śharaṇanedi
ādigŏni nannum̐ bāya vaṁtarātmavai nīvu
vīdaravĕlli pŏṁdulu vina nanaṁgadamu
(||karuṇā||)
kānu ne naruhum̐ḍanu kadisi panulagu
ne navudu nŏgaḍigi ninnum̐ bāḍanu
yī nĕbāna śhrī veṁkaḍeśha nannu nelidivi
dānigim̐ daggaṁtĕ kāga dām̐ṭa nanaṁgadamu