Karma mamtaa maagu maaya gappevu gaaga

కర్మ మంటా మాకు మాయ గప్పేవు గాక
Language

(॥పల్లవి॥)
కర్మ మంటా మాకు మాయ గప్పేవు గాక
కర్మము ధర్మము నీ కల్పితమే కాదా

(॥కర్మ॥)
బ్రతుకు మంటేఁ జచ్చిన పరీక్షిత్తు బ్రతుకఁడా
మతి నారాయణాస్త్రము మానుమంటే మానదా
కతలుగా జలధులు కమ్మంటే రాళ్ళు గావా
యితవు నీకు నైతే యేపని యైనా నౌను

(॥కర్మ॥)
మలసి బ్రహ్మ మాయకు మారుమాయ సేయవా
అల ద్రౌపదికిఁ జీర లక్షయ మంటేఁ గావా
కులగిరులు నేలతో కుంగు మంటేఁ గుంగవా
యిల నీకు వలసితే యేపనియైనా నౌను

(॥కర్మ॥)
యిట్టిది విధి యనరా దిది యౌఁగా దనరాదు
పట్టి నీవు దలఁచిన యట్టౌఁగాన
యిట్టే శ్రీ వేంకటేశ యిందరిలోననుఁ గావు
యెట్టు నీకు వలసిన యేపనియైనా నాకు

(||pallavi||)
karma maṁṭā māgu māya gappevu gāga
karmamu dharmamu nī kalbidame kādā

(||karma||)
bradugu maṁṭem̐ jachchina parīkṣhittu bradugam̐ḍā
madi nārāyaṇāstramu mānumaṁṭe mānadā
kadalugā jaladhulu kammaṁṭe rāḽḽu gāvā
yidavu nīgu naide yebani yainā naunu

(||karma||)
malasi brahma māyagu mārumāya seyavā
ala draubadigim̐ jīra lakṣhaya maṁṭem̐ gāvā
kulagirulu nelado kuṁgu maṁṭem̐ guṁgavā
yila nīgu valaside yebaniyainā naunu

(||karma||)
yiṭṭidi vidhi yanarā didi yaum̐gā danarādu
paṭṭi nīvu dalam̐sina yaṭṭaum̐gāna
yiṭṭe śhrī veṁkaḍeśha yiṁdarilonanum̐ gāvu
yĕṭṭu nīgu valasina yebaniyainā nāgu