కప్పురము దిన్ననోటఁ గార మేలే
(॥పల్లవి॥)
కప్పురము దిన్ననోటఁ గార మేలే
యిప్పుడే కంటిమి వేసా లిఁక నేలే
(॥కప్పు॥)
కాంతుఁడు వద్దికి వచ్చి కన్నులెదుట నున్నాఁడు
చింతలెల్లఁ దీరినాను సిగ్గు లేలే
మంతనాన మాటాడఁగా మరఁగులే పెట్టేవు
వంతువరుసలు వచ్చె వాను లేలే
(॥కప్పు॥)
మక్కువ చల్లి యాతఁడు మనసెల్ల నిచ్చినాఁడు
మొక్కలము దీరినాను మోన మేలే
లక్కవలెఁ గరఁగీ నీలాగులెల్లాఁ జూచి చూచి
చక్కనాయఁ బనులెల్లా జాగు లేలే
(॥కప్పు॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడినాను
వావులు గలసె తలవంచ నేలే
వేవేలు వచ్చె నీకు విభుఁ డాతఁడైనాఁడు
కైవశమైనమీఁద కత లేలే
(||pallavi||)
kappuramu dinnanoḍam̐ gāra mele
yippuḍe kaṁṭimi vesā lim̐ka nele
(||kappu||)
kāṁtum̐ḍu vaddigi vachchi kannulĕduḍa nunnām̐ḍu
siṁtalĕllam̐ dīrinānu siggu lele
maṁtanāna māḍāḍam̐gā maram̐gule pĕṭṭevu
vaṁtuvarusalu vachchĕ vānu lele
(||kappu||)
makkuva salli yādam̐ḍu manasĕlla nichchinām̐ḍu
mŏkkalamu dīrinānu mona mele
lakkavalĕm̐ garam̐gī nīlāgulĕllām̐ jūsi sūsi
sakkanāyam̐ banulĕllā jāgu lele
(||kappu||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri ninnum̐ gūḍinānu
vāvulu galasĕ talavaṁcha nele
vevelu vachchĕ nīgu vibhum̐ ḍādam̐ḍainām̐ḍu
kaivaśhamainamīm̐da kada lele