Kappuramu dinanela kadum jalim badanela

కప్పురము దిననేల కడుఁ జలిఁ బడనేల
Language

(॥పల్లవి॥)
కప్పురము దిననేల కడుఁ జలిఁ బడనేల
అప్పటికి నాభాగ్య మంటి నంతె చాలును

(॥॥)
వద్దువద్దు అంతలేసి వట్టి చనవులు మాకు
పెద్దరికముతో నుండేబిగువే చాలు
తిద్దనేల నీగుణాలు తిట్టించుకొననేల
అద్దో యీడ నుండఁగా నైనపాటే చాలును

(॥॥)
ఆయ నాయ జాణతనా లంతేసి కోప నేను
చేయి చెక్కిటితో నుండేసిగ్గే చాలు
ఆయము లంటఁగనేల అద్దలింపించుకోనేల
చాయల సన్నలలోని సంతసమే చాలు

(॥॥)
పట్టకు పట్టకు నీతో పంతము నెరపఁగనేర
గుట్టుతో నీసముకపుఁ గోలువే చాలు
యెట్టె శ్రీవేంకటేశ యిడె నన్నుఁ గూడితివి
జట్టిగొన్న నీ మోవిచవులే చాలును

(||pallavi||)
kappuramu dinanela kaḍum̐ jalim̐ baḍanela
appaḍigi nābhāgya maṁṭi naṁtĕ sālunu

(||||)
vadduvaddu aṁtalesi vaṭṭi sanavulu māgu
pĕddarigamudo nuṁḍebiguve sālu
tiddanela nīguṇālu tiṭṭiṁchugŏnanela
addo yīḍa nuṁḍam̐gā nainabāḍe sālunu

(||||)
āya nāya jāṇadanā laṁtesi koba nenu
seyi sĕkkiḍido nuṁḍesigge sālu
āyamu laṁṭam̐ganela addaliṁpiṁchugonela
sāyala sannalaloni saṁtasame sālu

(||||)
paṭṭagu paṭṭagu nīdo paṁtamu nĕrabam̐ganera
guṭṭudo nīsamugabum̐ goluve sālu
yĕṭṭĕ śhrīveṁkaḍeśha yiḍĕ nannum̐ gūḍidivi
jaṭṭigŏnna nī movisavule sālunu