Kappuramamdugomtim gadabaraaya neegum

కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ
Language

(॥పల్లవి॥)
కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ
గప్పము మా జవ్వనము కడపరాయ

(॥॥)
కన్నుల మొక్కేనోయి కడపరాయ నా
కన్నెచన్ను లేలంటేవు కడపరాయ
కన్నవారెల్లా నవ్వేరు కడపరాయ నాతో
సన్న లేల సేసేవు సారెఁ గడపరాయ

(॥॥)
కలఁగంటిఁ గడవోయి కడపరాయ యిఁకఁ
గలఁచకు మాసిగ్గు కడపరాయ
కలువల వేసేవేల కడపరాయ నీకు
మొలకనవ్వులతోడ మొక్కేఁ గడపరాయ

(॥॥)
కరుణించి నన్నేలితి కడపరాయ నీ
గరిమలెల్లాఁ గంటి కడపరాయ
గరిడిసామురతులఁ గడపరాయ నీకు
యిరవు శ్రీవేంకటాద్రి యిట్టే కడపరాయ

(||pallavi||)
kappuramaṁdugŏṁṭim̐ gaḍabarāya nīgum̐
gappamu mā javvanamu kaḍabarāya

(||||)
kannula mŏkkenoyi kaḍabarāya nā
kannĕsannu lelaṁṭevu kaḍabarāya
kannavārĕllā navveru kaḍabarāya nādo
sanna lela sesevu sārĕm̐ gaḍabarāya

(||||)
kalam̐gaṁṭim̐ gaḍavoyi kaḍabarāya yim̐kam̐
galam̐sagu māsiggu kaḍabarāya
kaluvala vesevela kaḍabarāya nīgu
mŏlaganavvuladoḍa mŏkkem̐ gaḍabarāya

(||||)
karuṇiṁchi nannelidi kaḍabarāya nī
garimalĕllām̐ gaṁṭi kaḍabarāya
gariḍisāmuradulam̐ gaḍabarāya nīgu
yiravu śhrīveṁkaḍādri yiṭṭe kaḍabarāya