Kanumgonu midu neegaamtanu ramanumda

కనుఁగొను మిటు నీకాంతను రమణుఁడ
Language

(॥పల్లవి॥)
కనుఁగొను మిటు నీకాంతను రమణుఁడ
తనివోని రతికిఁ దమకించీని

(॥కను॥)
చెలపలచెమటలు చెక్కుల నూరఁగ
చిలుకుఁజూపులను చిమ్మీఁ జెలి
వలపులు నీపై వడిఁ బురికొనఁగా
కులుకుజం కెనలఁ గొసరి నిదివో

(॥కను॥)
మనసున నాసలు మల్లడి గొనఁగా
చనవుల నవ్వులు చల్లీని
వినయము నీతో వెల్లవిరులుగా
పెనఁగి సరసములు బెరిఇంచీని

(॥కను॥)
మాటలతేటలు మర్మము లంటఁగ
కూటపు ముద్దులు గురిసీని
గాటపుశ్రీవేంకటేశ యనయఁగ
మేటివి నీవని మెచ్చీ నిపుడు

(||pallavi||)
kanum̐gŏnu miḍu nīgāṁtanu ramaṇum̐ḍa
tanivoni radigim̐ damagiṁchīni

(||kanu||)
sĕlabalasĕmaḍalu sĕkkula nūram̐ga
silugum̐jūbulanu simmīm̐ jĕli
valabulu nībai vaḍim̐ burigŏnam̐gā
kulugujaṁ kĕnalam̐ gŏsari nidivo

(||kanu||)
manasuna nāsalu mallaḍi gŏnam̐gā
sanavula navvulu sallīni
vinayamu nīdo vĕllavirulugā
pĕnam̐gi sarasamulu bĕriiṁchīni

(||kanu||)
māḍaladeḍalu marmamu laṁṭam̐ga
kūḍabu muddulu gurisīni
gāḍabuśhrīveṁkaḍeśha yanayam̐ga
meḍivi nīvani mĕchchī nibuḍu