కనుఁగొనేఁ గానీలేవే కామిని నీజాడలు
(॥పల్లవి॥)
కనుఁగొనేఁ గానీలేవే కామిని నీజాడలు
మనసే తమకించితే మఱి యేమి సేసేవో
(॥॥)
కలువల వేసితేనే కాఁతాళించేదానవు
యెలమి మరునమ్ముల కేమినేతువో
సెలవుల నవ్వితేనే చీఁదరరేఁగే దానవు
లలి వెన్నెలకు నెంతలావుగా రేఁగుదువో
(॥॥)
నెమ్మి నేమాఁటలాడితే నేరుపులెంచేదానవు
తుమ్మిదమోతల నెంతదూరుదువో
చిమ్ముఁ జూపులఁ జూచితే చేత నొడ్డేదానవు
యిమ్ముల మెఱఁగులకు నెంత వొడ్డుకొనేవో
(॥॥)
గట్టిచన్నులు నేనంటఁగా సిగ్గువడేదానవు
అట్టె తమ్మిమొగ్గల నెంతాడుకొందువో
నెట్టన నన్నుఁ గూడితి నేను శ్రీ వేంకటేశుఁడ
మట్టున నింకా నన్ను మతి నెట్టు గూడేవో
(||pallavi||)
kanum̐gŏnem̐ gānīleve kāmini nījāḍalu
manase tamagiṁchide maṟi yemi sesevo
(||||)
kaluvala vesidene kām̐tāḽiṁchedānavu
yĕlami marunammula kemineduvo
sĕlavula navvidene sīm̐dararem̐ge dānavu
lali vĕnnĕlagu nĕṁtalāvugā rem̐guduvo
(||||)
nĕmmi nemām̐ṭalāḍide nerubulĕṁchedānavu
tummidamodala nĕṁtadūruduvo
simmum̐ jūbulam̐ jūside seda nŏḍḍedānavu
yimmula mĕṟam̐gulagu nĕṁta vŏḍḍugŏnevo
(||||)
gaṭṭisannulu nenaṁṭam̐gā sigguvaḍedānavu
aṭṭĕ tammimŏggala nĕṁtāḍugŏṁduvo
nĕṭṭana nannum̐ gūḍidi nenu śhrī veṁkaḍeśhum̐ḍa
maṭṭuna niṁkā nannu madi nĕṭṭu gūḍevo