(॥పల్లవి॥)
కనుఁగొనవయ్యా కలికిని
కొలువు(కొనుపు?)నఁ జిలుకలకొలికిని
(॥॥)
వదనకమల మటువంచి
పొదిగొనుచూపులఁ బొంచి
మెదలేటికళలను మించి
అదె నీపయిఁ జెలి యాసలునించీ
(॥॥)
మునుకొని చేతుల మొక్కి
నినుపుఁ దమకముల నిక్కి
తనియనిమాఁటల దక్కి
పనివడి నీపాదము దొక్కీ
(॥॥)
పలురాగంబులఁ బాడి
వలవంతల వసివాడి
యెలమిని శ్రీవేంకటేశ పై యాడి
అలమేల్మంగ నిన్నంకెలఁగూడీ
(||pallavi||)
kanum̐gŏnavayyā kaligini
kŏluvu(kŏnubu?)nam̐ jilugalagŏligini
(||||)
vadanagamala maḍuvaṁchi
pŏdigŏnusūbulam̐ bŏṁchi
mĕdaleḍigaḽalanu miṁchi
adĕ nībayim̐ jĕli yāsaluniṁchī
(||||)
munugŏni sedula mŏkki
ninubum̐ damagamula nikki
taniyanimām̐ṭala dakki
panivaḍi nībādamu dŏkkī
(||||)
palurāgaṁbulam̐ bāḍi
valavaṁtala vasivāḍi
yĕlamini śhrīveṁkaḍeśha pai yāḍi
alamelmaṁga ninnaṁkĕlam̐gūḍī