Kanumgonavayya yeebe gaamididanamu lellaa

కనుఁగొనవయ్య యీపె గామిడితనము లెల్లా
Language

(॥పల్లవి॥)
కనుఁగొనవయ్య యీపె గామిడితనము లెల్లా
తనకుఁ దానే వట్టితమిఁ బొరలీని*

(॥కనుఁ॥)
సందడి నీకాలుదొక్కి సారె సారె నీతో నవ్వి
అందరితో నాడుకొనీ ఆలనంటాను
చెంది నీవు ముడిచివేసినపూవులు ముడిచి
కందువతో మురిసీనికడుదొరనంటాను

(॥కనుఁ॥)
పాదుకొన నీవద్దిపనులు చేసి యందరి
సాదించీఁ దా నేలికసానినంటాను
సాదువలెఁ బళ్లెముప్రసాదము తా నారగించి
సోదించి కులము చెప్పీఁ జుట్టమనంటాను

(॥కనుఁ॥)
పరగ నీవుగట్టినపచ్చడపురేకు గట్టి
వరుసకు వచ్చీఁ జనవరినంటాను
యిరవై శ్రీవేంకటేశ యెనసితి నిటు నన్ను
పరఁదుక కాఁగిలించీఁ బాయలేనంటాను

(||pallavi||)
kanum̐gŏnavayya yībĕ gāmiḍidanamu lĕllā
tanagum̐ dāne vaṭṭidamim̐ bŏralīni*

(||kanum̐||)
saṁdaḍi nīgāludŏkki sārĕ sārĕ nīdo navvi
aṁdarido nāḍugŏnī ālanaṁṭānu
sĕṁdi nīvu muḍisivesinabūvulu muḍisi
kaṁduvado murisīnigaḍudŏranaṁṭānu

(||kanum̐||)
pādugŏna nīvaddibanulu sesi yaṁdari
sādiṁchīm̐ dā neligasāninaṁṭānu
sāduvalĕm̐ baḽlĕmuprasādamu tā nāragiṁchi
sodiṁchi kulamu sĕppīm̐ juṭṭamanaṁṭānu

(||kanum̐||)
paraga nīvugaṭṭinabachchaḍaburegu gaṭṭi
varusagu vachchīm̐ janavarinaṁṭānu
yiravai śhrīveṁkaḍeśha yĕnasidi niḍu nannu
param̐duga kām̐giliṁchīm̐ bāyalenaṁṭānu