(॥పల్లవి॥)
కనుఁగొనరే యిరుగడ చెలులూ
పనివడి యివి యేర్పరచఁగఁగలరా
(॥కను॥)
ముదితనవ్వులును మొగిఁ బతికాంతులు
గుదిగొని యిరుదెసఁ గూడఁగను
యిది దిన మిది రే యిపుడని యెఱుఁగక
ముదముల చెమటల మునిఁగిరి దాము
(॥కను॥)
కలికికోరికలుఁ గాంతునియాసలు
కలసెను మనసులఁ గౌ లనిసి
తలఁపుల నివియే తడఁబడఁజేయఁగ
నిలువున నూరకె నివ్వెరగైరి
(॥కను॥)
అతివనేరుపులు నటు శ్రీవేంకట-
పతిరతులు నొకట బలుసుకొని
చతురతనంబుల సందడిసేయఁగ
యితవగుకాఁగిట నెడమీరైరి
(||pallavi||)
kanum̐gŏnare yirugaḍa sĕlulū
panivaḍi yivi yerbarasam̐gam̐galarā
(||kanu||)
mudidanavvulunu mŏgim̐ badigāṁtulu
gudigŏni yirudĕsam̐ gūḍam̐ganu
yidi dina midi re yibuḍani yĕṟum̐gaga
mudamula sĕmaḍala munim̐giri dāmu
(||kanu||)
kaligigorigalum̐ gāṁtuniyāsalu
kalasĕnu manasulam̐ gau lanisi
talam̐pula niviye taḍam̐baḍam̐jeyam̐ga
niluvuna nūragĕ nivvĕragairi
(||kanu||)
adivanerubulu naḍu śhrīveṁkaḍa-
padiradulu nŏgaḍa balusugŏni
saduradanaṁbula saṁdaḍiseyam̐ga
yidavagugām̐giḍa nĕḍamīrairi