కనుకొనవయ్యా ఘనుఁడవన్నిటా నీవు
(॥పల్లవి॥)
కనుకొనవయ్యా ఘనుఁడవన్నిటా నీవు
వినుకొనవయ్యా విభుఁడవు నీవు
(॥కను॥)
సుదతి నిన్నుఁ జూచే చూపులలో నున్నది
మదిలోని నీపై తమకమెల్లాను
కొదలేని కొసరుఁబల్కులలోన నున్నవి
అదన మనసులోని యాసలెల్లాను
(॥కను॥)
నలినాక్షి నీతో నవ్వే నవ్వులలో నున్నది
మొలకలెత్తిన తన మోహమెల్లాను
చెలరేఁగి తాఁజేసే సేవలలో నున్నది
బెళకులేని తన ప్రియమెల్లాను
(॥కను॥)
కామిని నిన్నుఁ గూడిన కాఁగిటిలో నున్నది
నేమపు రతులలోని నేరుపెల్లాను
దీమసాన నిన్నుఁబొందే దేహమందే వున్నది
యీమేర శ్రీవేంకటేశ యిచ్చకమెల్లాను
(||pallavi||)
kanugŏnavayyā ghanum̐ḍavanniḍā nīvu
vinugŏnavayyā vibhum̐ḍavu nīvu
(||kanu||)
sudadi ninnum̐ jūse sūbulalo nunnadi
madiloni nībai tamagamĕllānu
kŏdaleni kŏsarum̐balgulalona nunnavi
adana manasuloni yāsalĕllānu
(||kanu||)
nalinākṣhi nīdo navve navvulalo nunnadi
mŏlagalĕttina tana mohamĕllānu
sĕlarem̐gi tām̐jese sevalalo nunnadi
bĕḽaguleni tana priyamĕllānu
(||kanu||)
kāmini ninnum̐ gūḍina kām̐giḍilo nunnadi
nemabu radulaloni nerubĕllānu
dīmasāna ninnum̐bŏṁde dehamaṁde vunnadi
yīmera śhrīveṁkaḍeśha yichchagamĕllānu