కన్నులు చల్లఁగా నేము గారవించి చూచేము
(॥పల్లవి॥)
కన్నులు చల్లఁగా నేము గారవించి చూచేము
నిన్ను మెచ్చుటే మేలు నీవే బదుకవే
(॥॥)
గొప్ప లెంత లై నాను గుబ్బలకే మేలు
చిప్పిలెంత రసమున్నఁ జిగురుమోవికే మేలు
కప్పెంత గలిగినా కడుఁ గొప్పునకు మేలు
నెప్పున నెఁత చూపేవు నీవే బతుకవే
(॥॥)
నెమ్మిఁ గళ లెన్నియైనా నీ మొగానకే మేలు
చిమ్ము నవ్వు లెన్నియైనా సెలవులకే మేలు
పమ్మి నడ లందమైతే పాదములకే మేలు
నిమ్మలాన మెఱసేవు నీవే బతుకవే
(॥॥)
పిన్ననడు మెట్టున్నా పిఱుఁ దునకే మేలు
యెన్ని సింగారాలైనా నిట్టే నీ మేనికే మేలు
వన్నెల శ్రీ వేంకటేశ్వరుఁడ నాకోరిక
నిన్ననే యీడేరించితి నీవే బతుకవే
(||pallavi||)
kannulu sallam̐gā nemu gāraviṁchi sūsemu
ninnu mĕchchuḍe melu nīve badugave
(||||)
gŏppa lĕṁta lai nānu gubbalage melu
sippilĕṁta rasamunnam̐ jigurumovige melu
kappĕṁta galiginā kaḍum̐ gŏppunagu melu
nĕppuna nĕm̐ta sūbevu nīve badugave
(||||)
nĕmmim̐ gaḽa lĕnniyainā nī mŏgānage melu
simmu navvu lĕnniyainā sĕlavulage melu
pammi naḍa laṁdamaide pādamulage melu
nimmalāna mĕṟasevu nīve badugave
(||||)
pinnanaḍu mĕṭṭunnā piṟum̐ dunage melu
yĕnni siṁgārālainā niṭṭe nī menige melu
vannĕla śhrī veṁkaḍeśhvarum̐ḍa nāgoriga
ninnane yīḍeriṁchidi nīve badugave