Kannulu pemchavachchunaa kalamte kaaga

కన్నులు పెంచవచ్చునా కలంతే కాక
Language

(॥పల్లవి॥)
కన్నులు పెంచవచ్చునా కలంతే కాక
యెన్నిక నియ్యాలనైతి నెట్టైనాఁ జేయరా

(॥కన్ను॥)
చెంది నీమతిఁ గూరిమి సేసిపెట్టవచ్చునా
కందువఁ దన్నుఁదానే కలితేఁగాక
అంది నీకు నే మొక్కితే నాకడి పరాకైతి
విందుకంటె నూరకుండే నేమైనాఁ జేయరా

(॥కన్ను॥)
వినయాలు నాలుకపై వి తించవచ్చునా
కనుఁగొనఁ దనంతనే కలితేఁ గాక
ననుపై నే మాటడితే నాలి నీ వూరకుంటివి
యెనలేక నవ్వు నవ్వే నేమైనాఁ జేయరా

(॥కన్ను॥)
పోయినరాతిటిరతిఁ బోగుసేయవచ్చునా
కాయములోఁ దలపోఁత కలితేఁగాక
యీ యెడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
యీయరానిబాస లిచ్చే నేమైనాఁ జేయరా

(||pallavi||)
kannulu pĕṁchavachchunā kalaṁte kāga
yĕnniga niyyālanaidi nĕṭṭainām̐ jeyarā

(||kannu||)
sĕṁdi nīmadim̐ gūrimi sesibĕṭṭavachchunā
kaṁduvam̐ dannum̐dāne kalidem̐gāga
aṁdi nīgu ne mŏkkide nāgaḍi parāgaidi
viṁdugaṁṭĕ nūraguṁḍe nemainām̐ jeyarā

(||kannu||)
vinayālu nālugabai vi tiṁchavachchunā
kanum̐gŏnam̐ danaṁtane kalidem̐ gāga
nanubai ne māḍaḍide nāli nī vūraguṁṭivi
yĕnalega navvu navve nemainām̐ jeyarā

(||kannu||)
poyinarādiḍiradim̐ boguseyavachchunā
kāyamulom̐ dalabom̐ta kalidem̐gāga
yī yĕḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
yīyarānibāsa lichche nemainām̐ jeyarā