కన్నులనే నిన్నుఁ జూడఁగలవార మింతేకాక
(॥పల్లవి॥)
కన్నులనే నిన్నుఁ జూడఁగలవార మింతేకాక
వున్నచలమువారమా వూరకే జంకించను
(॥కన్ను॥)
యేరవులవారమా యేమన్నా నీతోడ
కెరలి చీటికిమాటికి నలుగను
తరవులవారమా దవ్వున నుండి రాకుంటే
కరికరించి పిలిచి కమ్మటి సాదించకు
(॥కన్ను॥)
మెచ్చనివారమా నేము మేకులనీచేఁతలెల్ల
అచ్చటనిచ్చట సారె నాడుకొను
మచ్చరిపువారమాపో మాటాడమఱచినా
ఇచ్చటనే మారుమోమై యెచ్చుకుందు లెంచను
(॥కన్ను॥)
పనిలేనివారమా పైకొని నీవు గూడఁగ
తనరి శ్రీవేంకటేశ తప్పించుకొను
తనియఁగఁ గూడితివి తగవు నగవు నీదె
పెఁనగేవారవ నీవు పిలువఁగ నిఁకను
(||pallavi||)
kannulane ninnum̐ jūḍam̐galavāra miṁtegāga
vunnasalamuvāramā vūrage jaṁkiṁchanu
(||kannu||)
yeravulavāramā yemannā nīdoḍa
kĕrali sīḍigimāḍigi naluganu
taravulavāramā davvuna nuṁḍi rāguṁṭe
karigariṁchi pilisi kammaḍi sādiṁchagu
(||kannu||)
mĕchchanivāramā nemu megulanīsem̐talĕlla
achchaḍanichchaḍa sārĕ nāḍugŏnu
machcharibuvāramābo māḍāḍamaṟasinā
ichchaḍane mārumomai yĕchchuguṁdu lĕṁchanu
(||kannu||)
panilenivāramā paigŏni nīvu gūḍam̐ga
tanari śhrīveṁkaḍeśha tappiṁchugŏnu
taniyam̐gam̐ gūḍidivi tagavu nagavu nīdĕ
pĕm̐nagevārava nīvu piluvam̐ga nim̐kanu