కన్నులనే దీపావళి కడుఁజన్నుల యుగాది
(॥పల్లవి॥)
కన్నులనే దీపావళి కడుఁజన్నుల యుగాది
యెన్నికలు నీకుఁ జేసె యియ్యకొనవయ్యా
(॥కన్ను॥)
అంగన మోముకళల నట్టె పచ్చఁగా నలికి
ముంగిట నవ్వులనే ముద్దులు వెట్టె
ఇంగితపుచూపుననే యదురుకొనెఁ బండుగ
సంగడిఁ గూచుండవయ్య చక్కెరమోవి విందు
(॥కన్ను॥)
కప్పినసిగ్గులనెల్లఁ గలవడములు గట్టె
ఇప్పుడె సరసముల నిచ్చె విడేలు
చిప్పిలుఁ జెమటలనే శిరసు మజ్జన మార్చె
కప్పెఁ బయ్యద కట్నాలు గైకొనవయ్య నీవును
(॥కన్ను॥)
అట్టె కాఁగిటఁ గావించె అంగరంగవైభవాలు
ముట్టినమీచెనకులు ముయికి ముయి
ఇట్టె శ్రీవేంకటేశ ఇంతి నిన్ను నిట్టె కూడె
గట్టిగాఁ జేకొనవయ్య కందువసోబనాలు
(||pallavi||)
kannulane dībāvaḽi kaḍum̐jannula yugādi
yĕnnigalu nīgum̐ jesĕ yiyyagŏnavayyā
(||kannu||)
aṁgana momugaḽala naṭṭĕ pachcham̐gā naligi
muṁgiḍa navvulane muddulu vĕṭṭĕ
iṁgidabusūbunane yadurugŏnĕm̐ baṁḍuga
saṁgaḍim̐ gūsuṁḍavayya sakkĕramovi viṁdu
(||kannu||)
kappinasiggulanĕllam̐ galavaḍamulu gaṭṭĕ
ippuḍĕ sarasamula nichchĕ viḍelu
sippilum̐ jĕmaḍalane śhirasu majjana mārsĕ
kappĕm̐ bayyada kaṭnālu gaigŏnavayya nīvunu
(||kannu||)
aṭṭĕ kām̐giḍam̐ gāviṁchĕ aṁgaraṁgavaibhavālu
muṭṭinamīsĕnagulu muyigi muyi
iṭṭĕ śhrīveṁkaḍeśha iṁti ninnu niṭṭĕ kūḍĕ
gaṭṭigām̐ jegŏnavayya kaṁduvasobanālu