కన్నులఁ జూచితేనే కడు దయ వుట్టె నాకు
(॥పల్లవి॥)
కన్నులఁ జూచితేనే కడు దయ వుట్టె నాకు
చిన్ని నవ్వు నవ్వకురే సిగ్గువడునేమో
(॥॥)
గందవొడి చల్లరే కడుఁ జెమటలు గారీ
యెందుండి వచ్చినాఁడో యాడకుఁ దానూ
కందువఁ బన్నీ రియ్యరే కడు దప్పి గొన్నాఁడు
అందుక యే మేమి పను లలయఁ జేసినాఁడో
(॥॥)
కొప్పు చక్కఁ బెట్టరే కురులు చెదరినవి
చిప్పిలఁగ సాములు సేసినాఁడేమో
వొప్పుగఁ బాన్పు వెయ్యరే రెప్పలను నిద్ర దేరీ
తప్పక జాగరాలు తా నెంత సేసినాఁడో
(॥॥)
పిలిచి వీడె మియ్యరే పిప్పిగట్టేఁ బెదవులు
చెలులకుఁ గత లెంత చెప్పినాఁడో
అలమేల్మంగను నేను అట్టే తా శ్రీ వేంకటేశుఁ
డెలమి నన్నేలె నిట్టే యెందరి నేలినాఁడో
(||pallavi||)
kannulam̐ jūsidene kaḍu daya vuṭṭĕ nāgu
sinni navvu navvagure sigguvaḍunemo
(||||)
gaṁdavŏḍi sallare kaḍum̐ jĕmaḍalu gārī
yĕṁduṁḍi vachchinām̐ḍo yāḍagum̐ dānū
kaṁduvam̐ bannī riyyare kaḍu dappi gŏnnām̐ḍu
aṁduga ye memi panu lalayam̐ jesinām̐ḍo
(||||)
kŏppu sakkam̐ bĕṭṭare kurulu sĕdarinavi
sippilam̐ga sāmulu sesinām̐ḍemo
vŏppugam̐ bānpu vĕyyare rĕppalanu nidra derī
tappaga jāgarālu tā nĕṁta sesinām̐ḍo
(||||)
pilisi vīḍĕ miyyare pippigaṭṭem̐ bĕdavulu
sĕlulagum̐ gada lĕṁta sĕppinām̐ḍo
alamelmaṁganu nenu aṭṭe tā śhrī veṁkaḍeśhum̐
ḍĕlami nannelĕ niṭṭe yĕṁdari nelinām̐ḍo