కన్నులపండుగవై కానవచ్చె మీ సుద్దులు
(॥పల్లవి॥)
కన్నులపండుగవై కానవచ్చె మీ సుద్దులు
అన్నిటాఁ గడమ లేదు అనుమానాలేలా
(॥కన్ను॥)
వెలఁది శిరసుమీఁది విరులు నీపై రాలె
అలరి నీ చెమటలు ఆమెపైఁ జిందె
కలగంపలాయ మీ కందువైన వలపులు
యెలమి నప్పటి మాఁట లింకానేలా
(॥కన్ను॥)
ముదిత కరకజఁడ ముంజేతఁ దగిలె నీకు
అదె నీ కంటసరులు ఆపెపై నిండె
యెదుబడి మించె ఇద్దరి మీసింగారాలు
కొద దీరె మనసులఁ గొంచించనేలా
(॥కన్ను॥)
వువిదచన్నులు నీపురముపై వెలవెట్టె
కవనీకరము లాకెకాఁకిట కెక్కె
యివల శ్రీవేంకటేశ యిప్పుడే నన్నేలితివి
చవులాయ మీరతులు చాటి చెప్పనేలా
(||pallavi||)
kannulabaṁḍugavai kānavachchĕ mī suddulu
anniḍām̐ gaḍama ledu anumānālelā
(||kannu||)
vĕlam̐di śhirasumīm̐di virulu nībai rālĕ
alari nī sĕmaḍalu āmĕbaim̐ jiṁdĕ
kalagaṁpalāya mī kaṁduvaina valabulu
yĕlami nappaḍi mām̐ṭa liṁkānelā
(||kannu||)
mudida karagajam̐ḍa muṁjedam̐ dagilĕ nīgu
adĕ nī kaṁṭasarulu ābĕbai niṁḍĕ
yĕdubaḍi miṁchĕ iddari mīsiṁgārālu
kŏda dīrĕ manasulam̐ gŏṁchiṁchanelā
(||kannu||)
vuvidasannulu nīburamubai vĕlavĕṭṭĕ
kavanīgaramu lāgĕgām̐kiḍa kĕkkĕ
yivala śhrīveṁkaḍeśha yippuḍe nannelidivi
savulāya mīradulu sāḍi sĕppanelā