Kannulabamdugalugaa kani mokkuduru neegu

కన్నులపండుగలుగా కని మొక్కుదురు నీకు
Language

(॥పల్లవి॥)
కన్నులపండుగలుగా కని మొక్కుదురు నీకు
యిన్నిటా మరుని తండ్రి యీతఁడే పో యనుచు

(॥కన్నుల॥)
చాలఁ బన్నీట మజ్జనమాడేటివేళ నిన్ను
పోలంచి పొగడుదురు బుదులెల్లాను
నీలవర్ణమే వచ్చి నిలిచి పురుషాకార
మీలీలఁ దాలిచె నేఁడు యిదివో యనుచు

(॥కన్నుల॥)
నిగిడి కప్పురధూళి నిండా నీమేన నించఁగాఁ
దగ నానందింతురు నీదాసు లెల్లాను
వొగిఁ బాలజలధికి వొడ్డినసప్తాంగాలు
జిగి మొలిచె నిదివో చెలువుగా ననుచు

(॥కన్నుల॥)
అంచఁ దట్టువుణుఁగు పూఁసెలమేలుమంగ నెద
నుంచుకొంటేనే మెత్తురు యోగీంద్రు లెల్లా
కాంచనపుగనులతోఁ గలయ శేషాచలము
ముంచి శ్రీవేంకటేశ్వరమూర్తి యాయ ననుచు

(||pallavi||)
kannulabaṁḍugalugā kani mŏkkuduru nīgu
yinniḍā maruni taṁḍri yīdam̐ḍe po yanusu

(||kannula||)
sālam̐ bannīḍa majjanamāḍeḍiveḽa ninnu
polaṁchi pŏgaḍuduru budulĕllānu
nīlavarṇame vachchi nilisi puruṣhāgāra
mīlīlam̐ dālisĕ nem̐ḍu yidivo yanusu

(||kannula||)
nigiḍi kappuradhūḽi niṁḍā nīmena niṁcham̐gām̐
daga nānaṁdiṁturu nīdāsu lĕllānu
vŏgim̐ bālajaladhigi vŏḍḍinasaptāṁgālu
jigi mŏlisĕ nidivo sĕluvugā nanusu

(||kannula||)
aṁcham̐ daṭṭuvuṇum̐gu pūm̐sĕlamelumaṁga nĕda
nuṁchugŏṁṭene mĕtturu yogīṁdru lĕllā
kāṁchanabuganuladom̐ galaya śheṣhāsalamu
muṁchi śhrīveṁkaḍeśhvaramūrdi yāya nanusu