కన్నులారాఁ గంటిమయ్యా కామిని నేరుపులు
(॥పల్లవి॥)
కన్నులారాఁ గంటిమయ్యా కామిని నేరుపులు
సన్నలా చాయలా నిన్ను జట్టిగొనె నిపుడు
(॥కన్ను॥)
చిగురుల వేసి వేసి చెలియ నిన్నుఁ దనఁ
మొగము చేకొని మొక్కె నీకును
పగటుగుబ్బలమీఁదిపయ్యద జారఁగాను
నగవులు నగి నిన్ను నంటు చేకొనెను
(॥కన్ను॥)
నెట్టమఁ గానుక చూపి నిన్నుఁజెయి చాపించి
అట్టె నీకు నాస రేఁచి ఆయా లంటెను
దిట్టతనమున మోవితేనెలు గారఁగాను
యిట్టు నట్టు మాటాడి ని న్నింటికి రప్పించెను
(॥కన్ను॥)
పాదములు నీకు నొత్తి భావములు గరఁగించి
బోదింపించుకొని నీతోఁ బొందు సేసెను
ఆదరించి శ్రీ వేంకటేధివ న న్నేలితివి
నీదయతో నాపె చూచి నిమ్మలాన నుండెను
(||pallavi||)
kannulārām̐ gaṁṭimayyā kāmini nerubulu
sannalā sāyalā ninnu jaṭṭigŏnĕ nibuḍu
(||kannu||)
sigurula vesi vesi sĕliya ninnum̐ danam̐
mŏgamu segŏni mŏkkĕ nīgunu
pagaḍugubbalamīm̐dibayyada jāram̐gānu
nagavulu nagi ninnu naṁṭu segŏnĕnu
(||kannu||)
nĕṭṭamam̐ gānuga sūbi ninnum̐jĕyi sābiṁchi
aṭṭĕ nīgu nāsa rem̐si āyā laṁṭĕnu
diṭṭadanamuna movidenĕlu gāram̐gānu
yiṭṭu naṭṭu māḍāḍi ni nniṁṭigi rappiṁchĕnu
(||kannu||)
pādamulu nīgu nŏtti bhāvamulu garam̐giṁchi
bodiṁpiṁchugŏni nīdom̐ bŏṁdu sesĕnu
ādariṁchi śhrī veṁkaḍedhiva na nnelidivi
nīdayado nābĕ sūsi nimmalāna nuṁḍĕnu