కన్నుల చల్లఁగా మిమ్ముఁ గనుగొంటిని
(॥పల్లవి॥)
కన్నుల చల్లఁగా మిమ్ముఁ గనుగొంటిని
సన్నలా చాయలా నిఁక జరయఁగ నేఁటికి
(॥కన్ను॥)
అనుమానమెల్లఁ దీరె ఆకె నీవూఁ గూడితివి
మనసొక్కటాయఁగా మాటలేఁటికి
చెనకులు గరివడె చెక్కులఁ జెమట నిండె
వెనకముందర లెంచి విచారించనేఁటికి
(॥కన్ను॥)
మొగమోట లొనగూడె ముందర నున్నారు మీరు
తగవాయఁ బనులెల్లా దాఁచనేఁటికి
జిగిఁ గళ లెదురెక్కె సిగ్గులు ముంగిటఁ బడె
తగిలెఁ జుట్టరికము తడఁబాటులేఁటికి
(॥కన్ను॥)
తారుకాణయ రతులు దక్కె సంతోసములెల్లా
చేరెఁ బంతములు నే డె చింతలేఁటికి
యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కోరి నన్ను నేలితివి గుట్టుసేయనేఁటికి
(||pallavi||)
kannula sallam̐gā mimmum̐ ganugŏṁṭini
sannalā sāyalā nim̐ka jarayam̐ga nem̐ṭigi
(||kannu||)
anumānamĕllam̐ dīrĕ āgĕ nīvūm̐ gūḍidivi
manasŏkkaḍāyam̐gā māḍalem̐ṭigi
sĕnagulu garivaḍĕ sĕkkulam̐ jĕmaḍa niṁḍĕ
vĕnagamuṁdara lĕṁchi visāriṁchanem̐ṭigi
(||kannu||)
mŏgamoḍa lŏnagūḍĕ muṁdara nunnāru mīru
tagavāyam̐ banulĕllā dām̐sanem̐ṭigi
jigim̐ gaḽa lĕdurĕkkĕ siggulu muṁgiḍam̐ baḍĕ
tagilĕm̐ juṭṭarigamu taḍam̐bāḍulem̐ṭigi
(||kannu||)
tārugāṇaya radulu dakkĕ saṁtosamulĕllā
serĕm̐ baṁtamulu ne ḍĕ siṁtalem̐ṭigi
yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kori nannu nelidivi guṭṭuseyanem̐ṭigi