కన్నుల పండుగలాయఁ గనుఁగొని మాకైతే
(॥పల్లవి॥)
కన్నుల పండుగలాయఁ గనుఁగొని మాకైతే
యెన్న నీ దేవుల నైనా నేమి వేడుకాయనూ
(॥॥)
చనవిచ్చి నీ వాపెతో సరసము లాడఁగాను
చెనకి విన్నపా లాకె సేయఁగాను
యెనలేని సంతోసాన నెంతో నీవు చెలఁగఁగా
చను మొన లంట నాకె సారెఁ గొప్పు దువ్వఁగా
(॥॥)
చేరి నీ వాకె నప్పటి చెక్కు నొక్కి వేఁడుకోఁగా
నారుకొనఁ దాను చిఱునవ్వు నవ్వఁగా
కూరిమిఁ గస్తూరిబొట్టు గోర నీవు దిద్దఁగాను
కోరి యాకు మడిచి తా నోర నీ కందిచ్చెను
(॥॥)
కందువ నంతలో నాకెఁ గౌఁగిట నీవు నించఁగా
అందులోనే సిగ్గు పడి యాకె వుండఁగా
చెంది నన్నేలి యాకెను శ్రీ వేంకటేశ కూడఁగా
మందలించి యలమేలుమంగ నిన్నొరసెనూ
(||pallavi||)
kannula paṁḍugalāyam̐ ganum̐gŏni māgaide
yĕnna nī devula nainā nemi veḍugāyanū
(||||)
sanavichchi nī vābĕdo sarasamu lāḍam̐gānu
sĕnagi vinnabā lāgĕ seyam̐gānu
yĕnaleni saṁtosāna nĕṁto nīvu sĕlam̐gam̐gā
sanu mŏna laṁṭa nāgĕ sārĕm̐ gŏppu duvvam̐gā
(||||)
seri nī vāgĕ nappaḍi sĕkku nŏkki vem̐ḍugom̐gā
nārugŏnam̐ dānu siṟunavvu navvam̐gā
kūrimim̐ gastūribŏṭṭu gora nīvu diddam̐gānu
kori yāgu maḍisi tā nora nī kaṁdichchĕnu
(||||)
kaṁduva naṁtalo nāgĕm̐ gaum̐giḍa nīvu niṁcham̐gā
aṁdulone siggu paḍi yāgĕ vuṁḍam̐gā
sĕṁdi nanneli yāgĕnu śhrī veṁkaḍeśha kūḍam̐gā
maṁdaliṁchi yalamelumaṁga ninnŏrasĕnū