Kannula nee raampa lega kaamkalu niluba lega

కన్నుల నీ రాఁప లేక కాఁకలు నిలుప లేక
Language

(॥పల్లవి॥)
కన్నుల నీ రాఁప లేక కాఁకలు నిలుప లేక
పన్ని పెద్దయెలుఁ గెత్తి పాడితి నోయమ్మా

(॥కన్నుల॥)
దగ్గరి వచ్చినవాని తడవి నేనే మన్నా
అగ్గలము నావొళ్లిదె యౌ నేరమి
వెగ్గళించ రాదు మరి వెనక తియ్యఁగ రాదు
బగ్గనఁ బాదాలమీఁదఁ బడితి నోయమ్మా

(॥కన్నుల॥)
చేయి మీఁద వేసేవాని చేఁత నే నేమి సేసినా
నాయము గా దని మీరు నన్నే అందురు
పోయినట్టె పోనీలేను పొంచి కొత్త సేయ లేను
సేయ రాని వినయాలు చేసితి నోయమ్మా

(॥కన్నుల॥)
వుమ్మడిఁ గాఁగిలించఁగ వోప నంటే అంతలోనే
కిమ్ముల నాతఁడు నాకుఁ గిందు పడును
నెమ్మది శ్రీవెంకటేశు నేనె మునుపఁ గూడి
సమ్మతించి ఆనందమే చల్లితి నోయమ్మా

(||pallavi||)
kannula nī rām̐pa lega kām̐kalu niluba lega
panni pĕddayĕlum̐ gĕtti pāḍidi noyammā

(||kannula||)
daggari vachchinavāni taḍavi nene mannā
aggalamu nāvŏḽlidĕ yau nerami
vĕggaḽiṁcha rādu mari vĕnaga tiyyam̐ga rādu
bagganam̐ bādālamīm̐dam̐ baḍidi noyammā

(||kannula||)
seyi mīm̐da vesevāni sem̐ta ne nemi sesinā
nāyamu gā dani mīru nanne aṁduru
poyinaṭṭĕ ponīlenu pŏṁchi kŏtta seya lenu
seya rāni vinayālu sesidi noyammā

(||kannula||)
vummaḍim̐ gām̐giliṁcham̐ga voba naṁṭe aṁtalone
kimmula nādam̐ḍu nāgum̐ giṁdu paḍunu
nĕmmadi śhrīvĕṁkaḍeśhu nenĕ munubam̐ gūḍi
sammadiṁchi ānaṁdame sallidi noyammā