కన్నియ ముద్దరాలు కడుఁబిన్న
(॥పల్లవి॥)
కన్నియ ముద్దరాలు కడుఁబిన్న
యెన్నిక నీ కాతరాన కింత కోపునా
(॥కన్ని॥)
చెక్కులవెంటఁగారీ చెలియకుఁ జెమటలు
అక్కరతో రతి నెంత యలయించితివో
ముక్కున నిట్టూర్పులు మునుకొని రేఁగెను
పెక్కు విధముల నెంత పెనఁగితివో
(॥కన్ని॥)
మడమెలదాఁకా వీడె మగువ నెరిఁగురులు
తడవి యెంత సదమదము సేసితో
కడింగి కస్తూరి బొట్టు కడజిందువందులాయ
అలాగ మర్మము లెంత అంటితివో
(॥కన్ని॥)
చిమ్ముచుఁ గన్నుల నదె చిందీ నిద్దురలింతి
యెమ్మె జాగర యెంత సేయించితివో
కమ్మి శ్రీవేంకటేశుఁడ కాఁగిలింపించుకొంటివి
కిమ్ముల సిగ్గు లెంతేసి కెరలించితివో
(||pallavi||)
kanniya muddarālu kaḍum̐binna
yĕnniga nī kādarāna kiṁta kobunā
(||kanni||)
sĕkkulavĕṁṭam̐gārī sĕliyagum̐ jĕmaḍalu
akkarado radi nĕṁta yalayiṁchidivo
mukkuna niṭṭūrbulu munugŏni rem̐gĕnu
pĕkku vidhamula nĕṁta pĕnam̐gidivo
(||kanni||)
maḍamĕladām̐kā vīḍĕ maguva nĕrim̐gurulu
taḍavi yĕṁta sadamadamu sesido
kaḍiṁgi kastūri bŏṭṭu kaḍajiṁduvaṁdulāya
alāga marmamu lĕṁta aṁṭidivo
(||kanni||)
simmusum̐ gannula nadĕ siṁdī nidduraliṁti
yĕmmĕ jāgara yĕṁta seyiṁchidivo
kammi śhrīveṁkaḍeśhum̐ḍa kām̐giliṁpiṁchugŏṁṭivi
kimmula siggu lĕṁtesi kĕraliṁchidivo