Kannevayasu meemdane ghanajavvanamu vachche

కన్నెవయసు మీఁదనే ఘనజవ్వనము వచ్చె
Language

(॥పల్లవి॥)
కన్నెవయసు మీఁదనే ఘనజవ్వనము వచ్చె
విన్న కన్న చోటనేల వెరగందేవే

(॥కన్నె॥)
పూచినవెన్నెలనవ్వు పుప్పొడితేనెమాటలు
కాచిన చన్నుల నిమ్మకాయ లవిగో
యేచిన వసంతకాల మిప్పుడే నీ మేన నిండె
చేచేత నిఁకనేల సిగ్గువడేవే

(॥కన్నె॥)
కందువ చిగురు మోవి కప్పినకన్నులకావి
మందపు నిట్టూర్పులమంచిగాలి
అందపునీ మేనిమీఁద నామనికాలము వచ్చె
యిందులో నీపతి వచ్చె నేలకొంకేవే

(॥కన్నె॥)
పండినపులకపంట పాయపుఁగళలపచ్చి
మెండగుబాహులతలు మేరవరెను
నిండి శ్రీవేంకటపతి నిన్నుఁ గూడెఁ దతికాల
మండనే నీమేనఁ దోఁచె ననుమానమేలే

(||pallavi||)
kannĕvayasu mīm̐dane ghanajavvanamu vachchĕ
vinna kanna soḍanela vĕragaṁdeve

(||kannĕ||)
pūsinavĕnnĕlanavvu puppŏḍidenĕmāḍalu
kāsina sannula nimmagāya lavigo
yesina vasaṁtagāla mippuḍe nī mena niṁḍĕ
seseda nim̐kanela sigguvaḍeve

(||kannĕ||)
kaṁduva siguru movi kappinagannulagāvi
maṁdabu niṭṭūrbulamaṁchigāli
aṁdabunī menimīm̐da nāmanigālamu vachchĕ
yiṁdulo nībadi vachchĕ nelagŏṁkeve

(||kannĕ||)
paṁḍinabulagabaṁṭa pāyabum̐gaḽalabachchi
mĕṁḍagubāhuladalu meravarĕnu
niṁḍi śhrīveṁkaḍabadi ninnum̐ gūḍĕm̐ dadigāla
maṁḍane nīmenam̐ dom̐sĕ nanumānamele