కన్నెపడుచు గనక గయ్యాళించ నేరదు
(॥పల్లవి॥)
కన్నెపడుచు గనక గయ్యాళించ నేరదు
మన్ననలు చూపి నిన్ను మరిగించవయ్యా
(॥॥)
తళుకున నిన్నుఁ జూచి తలవంచుకొని చెలి
తలపోసీ నీరూపు తనలోననే
జలజలఁ జెమరించె సరుగనఁ జెక్కులెల్లా
చెలఁగి కాఁగిట నించి నిగ్గు వాపవయ్యా
(॥॥)
వుదుటున మాటలాడి వొరగి పానుపు మీఁద
యెదురుచూచీ రతికి నేక తానను
ముదురుఁబులకలెల్లా మోసులెత్తె మేన నిండా
యెదపైఁ జేవేసి యాస యీడేరించవయ్యా
(॥॥)
నెట్టిన నిన్నుఁ గాగిట నించి నివ్వెరఁగునొంది
గుట్టుతోఁ గోరికలెల్లాఁ గోరీనిదే
ఇట్టె శ్రీవేంకటేశ యెనసి మొక్కులు మొక్కీ
కట్టుసేయకింక నిట్టె దిట్టఁ జేయవయ్యా
(||pallavi||)
kannĕbaḍusu ganaga gayyāḽiṁcha neradu
mannanalu sūbi ninnu marigiṁchavayyā
(||||)
taḽuguna ninnum̐ jūsi talavaṁchugŏni sĕli
talabosī nīrūbu tanalonane
jalajalam̐ jĕmariṁchĕ saruganam̐ jĕkkulĕllā
sĕlam̐gi kām̐giḍa niṁchi niggu vābavayyā
(||||)
vuduḍuna māḍalāḍi vŏragi pānubu mīm̐da
yĕdurusūsī radigi nega tānanu
mudurum̐bulagalĕllā mosulĕttĕ mena niṁḍā
yĕdabaim̐ jevesi yāsa yīḍeriṁchavayyā
(||||)
nĕṭṭina ninnum̐ gāgiḍa niṁchi nivvĕram̐gunŏṁdi
guṭṭudom̐ gorigalĕllām̐ gorīnide
iṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasi mŏkkulu mŏkkī
kaṭṭuseyagiṁka niṭṭĕ diṭṭam̐ jeyavayyā