Kannebadusavu gaana kada lemee neṟumgavu

కన్నెపడుచవు గాన కత లేమీ నెఱుఁగవు
Language

(॥పల్లవి॥)
కన్నెపడుచవు గాన కత లేమీ నెఱుఁగవు
మిన్నక నా మాట వింటే మేలయ్యీ నీకు

(॥॥)
వేడుకతో విభునికి వీడె మిచ్చి రమ్మంటేను
యీడనే సిగ్గు వడే విదేమే నీవు
చూడవే యాతఁ డంపెను సొమ్ములు నీ కంటేను
యేడో పరాకు సేసే విదేమే నీవు

(॥॥)
కొలువై యున్నాఁడాతఁడు గోడ నిక్కి చూడుమంటే
సెలవుల నవ్వేవు చెల్లఁబో నీవు
తలుపు మాఁటుకు వచ్చె దగ్గరి మాటాడు మంటే
చెలి యండనే వుండేవు చెల్లఁబో నీవు

(॥॥)
పరపుపైఁ బవళించె పాదాలు నీ వొత్తుమంటే
అరిదిఁ దొడ డిగ్గేవు అవునే నీవు
సరి నలమేల్మంగవు సరుగ శ్రీ వేంకటేశు
నరసి నేఁడు గూడితి వవునే నీవూ

(||pallavi||)
kannĕbaḍusavu gāna kada lemī nĕṟum̐gavu
minnaga nā māḍa viṁṭe melayyī nīgu

(||||)
veḍugado vibhunigi vīḍĕ michchi rammaṁṭenu
yīḍane siggu vaḍe videme nīvu
sūḍave yādam̐ ḍaṁpĕnu sŏmmulu nī kaṁṭenu
yeḍo parāgu sese videme nīvu

(||||)
kŏluvai yunnām̐ḍādam̐ḍu goḍa nikki sūḍumaṁṭe
sĕlavula navvevu sĕllam̐bo nīvu
talubu mām̐ṭugu vachchĕ daggari māḍāḍu maṁṭe
sĕli yaṁḍane vuṁḍevu sĕllam̐bo nīvu

(||||)
parabubaim̐ bavaḽiṁchĕ pādālu nī vŏttumaṁṭe
aridim̐ dŏḍa ḍiggevu avune nīvu
sari nalamelmaṁgavu saruga śhrī veṁkaḍeśhu
narasi nem̐ḍu gūḍidi vavune nīvū