Kanne muddaraalu kasumgaayavamtidee

కన్నె ముద్దరాలు కసుఁగాయవంటిదీ
Language

(॥పల్లవి॥)
కన్నె ముద్దరాలు కసుఁగాయవంటిదీ
వున్నతి మెల్లనే తేనె లుట్టి పడీఁ గాకా

(॥॥)
సిగ్గుతోఁ దలవంచఁగా చెక్కు నొక్కే వప్పటిని
అగ్గమైన పూవువంటి అబల యీకె
వెగ్గలింతురా తొల్లే వేఁడి వేఁడి వలపిదీ
బెగ్గిలక చల్లారితేఁ బేరుకొనీఁ గాకా

(॥॥)
తెరమాటున నుండఁగాఁ దీసేవు చేయి వట్టి
వరుసలేఁ దీగెవంటి వనిత యీకె
గొరబు సేతురా ఇంత కొత్త కొత్త వయసిదీ
పరువాన వికసించి పరిమళించీఁ గాకా

(॥॥)
పక్కనుండఁగా నప్పటి పలుమారుఁ గూడేవు
మిక్కిలిఁ జిగురు వంటి మెలఁత యీకె
చొక్కఁజేతురా రతి చూడఁ జూడ చోద్య మిదీ
నిక్కితి శ్రీ వేంకటేశ నిందుకొనీఁ గాకా

(||pallavi||)
kannĕ muddarālu kasum̐gāyavaṁṭidī
vunnadi mĕllane tenĕ luṭṭi paḍīm̐ gāgā

(||||)
siggudom̐ dalavaṁcham̐gā sĕkku nŏkke vappaḍini
aggamaina pūvuvaṁṭi abala yīgĕ
vĕggaliṁturā tŏlle vem̐ḍi vem̐ḍi valabidī
bĕggilaga sallāridem̐ berugŏnīm̐ gāgā

(||||)
tĕramāḍuna nuṁḍam̐gām̐ dīsevu seyi vaṭṭi
varusalem̐ dīgĕvaṁṭi vanida yīgĕ
gŏrabu sedurā iṁta kŏtta kŏtta vayasidī
paruvāna vigasiṁchi parimaḽiṁchīm̐ gāgā

(||||)
pakkanuṁḍam̐gā nappaḍi palumārum̐ gūḍevu
mikkilim̐ jiguru vaṁṭi mĕlam̐ta yīgĕ
sŏkkam̐jedurā radi sūḍam̐ jūḍa sodya midī
nikkidi śhrī veṁkaḍeśha niṁdugŏnīm̐ gāgā