కన్నె గొల్లపడుచులఁ గాకుసేతురా ఇంత
(॥పల్లవి॥)
కన్నె గొల్లపడుచులఁ గాకుసేతురా ఇంత
మిన్నకే వయసులెల్లా మీఁగడలు గట్టెను
(॥॥)
వుమ్మడివలపులు నీవువిదలపైఁ జల్లఁగ
పమ్ముచుఁ గుచములై కుప్పలుగట్టెను
తెమ్మలుగా సారెఁ దరితీపుల మాటలాడఁగ
దిమ్మురేఁగి మోవులను తేనె లూరఁజొచ్చెను
(॥॥)
అప్పటి దాఁగిలిముచ్చటలాడి సతులనంటఁగా
కొప్పులై చీఁకట్లు గుంపుగూడెను
తప్పక నఖచంద్రులు తనువులపై నించఁగా
విప్పుచు చిరునవ్వుల వెన్నెలలుగాసెను
(॥॥)
కారుకమ్మినరతులఁ గరగించి కూడఁగాను
యేరులై చెమటలు యీఁతలఁ బారె
యీరీతి శ్రీ వేంకటేశ ఇంతచనవియ్యఁగాను
కోరినకోరికలెల్లా గొబ్బున నీడేరేను
(||pallavi||)
kannĕ gŏllabaḍusulam̐ gāgusedurā iṁta
minnage vayasulĕllā mīm̐gaḍalu gaṭṭĕnu
(||||)
vummaḍivalabulu nīvuvidalabaim̐ jallam̐ga
pammusum̐ gusamulai kuppalugaṭṭĕnu
tĕmmalugā sārĕm̐ daridībula māḍalāḍam̐ga
dimmurem̐gi movulanu tenĕ lūram̐jŏchchĕnu
(||||)
appaḍi dām̐gilimuchchaḍalāḍi sadulanaṁṭam̐gā
kŏppulai sīm̐kaṭlu guṁpugūḍĕnu
tappaga nakhasaṁdrulu tanuvulabai niṁcham̐gā
vippusu sirunavvula vĕnnĕlalugāsĕnu
(||||)
kārugamminaradulam̐ garagiṁchi kūḍam̐gānu
yerulai sĕmaḍalu yīm̐talam̐ bārĕ
yīrīdi śhrī veṁkaḍeśha iṁtasanaviyyam̐gānu
korinagorigalĕllā gŏbbuna nīḍerenu