Kanne gadujavaraalu kaamini neegu meludi

కన్నె గడుజవరాలు కామిని నీకు మేలుది
Language

(॥పల్లవి॥)
కన్నె గడుజవరాలు కామిని నీకు మేలుది
ఇన్ని సేవలునుఁ జేసె నిఁక జాగులేఁటికి

(॥కన్నె॥)
కొమరెగుబ్బ లదరఁ గొలిచివచ్చీఁ జెలి
చెమటలు గాతఁగాను సిగ్గులోడను
అమరఁ బల్లకిమీఁద నాపెఁ బెట్టుకొనరాదా
రమణి యలయికలు రచ్చవేయనేఁటికి

(॥కన్నె॥)
సరిబిరుదువేకాన బిరబిర వచ్చీని
పరువులు వెట్టుకొంటా బడివాయక
ఇరవుగ గుఱ్ఱముపై నిద్దరూ నెక్కుకోరాదా
తరుణి నిందరిలో వింతలు సేయనేఁటికి

(॥కన్నె॥)
కడుబుసకొట్టుకొంటాఁ గైదండ నీకిచ్చుకొంటా
యెడయక మేడయెక్కె నిందాఁకా నీతో
తొడపై విడుకోరాదా తోడ శ్రీవేంకటేశ
పడఁతి గూడితి విఁక బచ్చిసేయనేఁటికి

(||pallavi||)
kannĕ gaḍujavarālu kāmini nīgu meludi
inni sevalunum̐ jesĕ nim̐ka jāgulem̐ṭigi

(||kannĕ||)
kŏmarĕgubba ladaram̐ gŏlisivachchīm̐ jĕli
sĕmaḍalu gādam̐gānu sigguloḍanu
amaram̐ ballagimīm̐da nābĕm̐ bĕṭṭugŏnarādā
ramaṇi yalayigalu rachchaveyanem̐ṭigi

(||kannĕ||)
saribiruduvegāna birabira vachchīni
paruvulu vĕṭṭugŏṁṭā baḍivāyaga
iravuga guṭramubai niddarū nĕkkugorādā
taruṇi niṁdarilo viṁtalu seyanem̐ṭigi

(||kannĕ||)
kaḍubusagŏṭṭugŏṁṭām̐ gaidaṁḍa nīgichchugŏṁṭā
yĕḍayaga meḍayĕkkĕ niṁdām̐kā nīdo
tŏḍabai viḍugorādā toḍa śhrīveṁkaḍeśha
paḍam̐ti gūḍidi vim̐ka bachchiseyanem̐ṭigi